calender_icon.png 1 October, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగ పూట విషాదం

01-10-2025 01:30:22 AM

  1. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

మామ అల్లుళ్ళ మృతి

సుల్తానాబాద్, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): సద్దుల బతుకమ్మ.... దసరా పండుగ పూట పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో విషాదం చోటుచేసుకుంది ..... సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామ శివారులో గోదాముల సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మామా అల్లుడు మృతి చెందారు.... సుల్తానాబాద్ పట్టణానికి చెందిన స్థానిక సివిల్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ముత్యం రాకేష్ (29), ప్రైవేటు స్కూల్లో పనిచేసే పూదారి రోహిత్ అలియాస్ అభి (24), సుగులంపల్లి గ్రామానికి చెందిన ఆదర్శ్ ముగ్గురు స్నేహితులు....

వీరు సుద్దాల గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా మరో బైక్ పై వెళ్తున్న అల్లిపూర్ గ్రామానికి చెందిన రఘు ఎదురెదురుగా ఢీకొన్నారు... నలుగురు తీవ్రంగా గాయపడ్డారు... కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఇందులో రాకేష్ హాస్పిటల్ లో మరణించగా, రోహిత్ మార్గమధ్యలోనే మృతి చెందాడు, గాయపడిన మరో ఇద్దరూ రఘు, ఆదర్శ్ లు కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు...

కాగా రాకేష్ కు రోహిత్ మేనల్లుడు... ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని సీఐ సుబ్బారెడ్డి , ఎస్త్స్ర శ్రావణ్ కుమార్ , జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, స్థానిక మున్సిపల్ కమిషనర్ రమేష్ లు సందర్శించారు... ఆస్పత్రిలో కుటుంబ సభ్యుల రోజున లు పలువురు నీ కంటతడి పెట్టించాయి... అంతటి అన్నయ్య గౌడ్ మృతుల కుటుంబ సభ్యులను ఆసుపత్రిలో పరామర్శించి ఓదార్చారు.... పండుగ పూట ఈ సంఘటన పెద్దపెల్లి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది..... ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.