calender_icon.png 6 December, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు..

06-12-2025 07:19:20 PM

అబద్ధపు హామీలతో నిండు ప్రాణాన్ని బలిగొన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు..

బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూప్ నార్ రమేష్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): 42 శాతం బీసీ రిజర్వేషన్ జరగకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందున బీసీలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని తీవ్ర మనస్తాపం చెందిన బీసీ నాయకుడు సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకుని ప్రాణత్యాగం చేయడం జరిగిందని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూపునర్ రమేష్ అన్నారు. సాయి ఈశ్వర చారి ఆత్మహత్యకు నిరసనగా శనివారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించే నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని బీసీ నాయకులను పోలీసులు ఎక్కడిక్కడే ముందస్తు అరెస్టు చేసి ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయి ఈశ్వర చారిది ఆత్మహత్య కాదని ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అన్నారు. బీసీ రిజర్వేషన్ ఇస్తామంటూనే రేవంత్ రెడ్డి తడిబట్టతో బీసీల గొంతు కోశారు అన్నారు. చారి త్యాగం వెలకట్టలేనిదని బీసీ రిజర్వేషన్లు ఆత్మహత్యలతో సాధ్యం కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధం చేసి సాధిద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ ఆవిడపు ప్రణయ్ బీసీ జేఏసీ నాయకులు వైరాగడే మారుతీ పటేల్, నాగోశే శంకర్, పొన్నాల నారాయణ, పురుషోత్తం బాలేష్, లోబడే లాహుకుమార్, బొట్టుపల్లి ప్రశాంత్, సిరికొండ సాయి కృష్ణ, రవికాంత్, శెండే నాందేవ్ తదితరులు ఉన్నారు.