calender_icon.png 6 December, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు చేరువగా సేవలను అందించడమే లక్ష్యం

06-12-2025 07:18:33 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యం వారి ఇంటి వద్దకు ఇబ్బంది కలగకుండా చేరవేయడం కోసం కరీంనగర్ నగరంలోని 59వ డివిజన్ ముకరంపుర ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం తాజా మాజీ కార్పొరేటర్ అఖీల్ ఫిరోజ్ ఆధ్వర్యంలో ఉచితంగా ఏర్పాటుచేసిన ఆటోలను ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ జెండా ఊపి ప్రారంభించారు. ఇదే డివిజన్లో సుమారు కోటి రూపాయల వ్యయంతో  సైడ్ డ్రైనేజీ, సిసి రోడ్ల నిర్మాణం పనులను సైతం గులాం అహ్మద్ హుస్సేన్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎంఐఎం పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కుల మతాలకు తేడా లేకుండా సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ముకరంపుర ప్రాంతంలో ఉచితంగా రేషన్ బియ్యం తమ గమ్యస్థానానికి చేరుకునే విధంగా తన సొంత ఖర్చులతో డివిజన్ ప్రజల సౌకర్యార్థం ఆటోలను ఏర్పాటు చేయడంపై అఖీల్ ఫిరోజ్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎం.ఏ మాజిద్ ఉస్మాని, హాజీ ఉస్మాని, బలరాం, అమాన్ అబ్బాస్ మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.