10-02-2026 12:16:50 AM
సెమీఫైనల్‌గా భావిస్తున్న పార్టీల నేతలు
మహబూబాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలు అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీల నే తలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్, కే సముద్రం, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలకు ఈనెల 11న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత తొలిసారిగా పార్టీ గు ర్తుపై నిర్వహిస్తున్న ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఐదు మున్సిపాలిటీలో గెలుపొందడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి తమ నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ స త్తాను చాటుకునేందుకు శ్రమిస్తున్నారు. ఇక్క డ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తిరి గి తన ప్రతిష్టను నిలబెట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మహబూబాబాద్ మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవ డానికి ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నా యక్, డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్యా ఉ మ పూర్తి బాధ్యతలను నెత్తికెత్తుకున్నారు.
ఇక డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచందర్ నాయక్ ప్రతిష్టత్మకంగా ముందుకు సా గుతున్నారు. అయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ మున్సిపల్ ఎన్నికలను సెమీఫైనల్ గా భావిస్తూ, ఈ ఎన్నికల్లో విజయంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి పాగా వేయాలని చూస్తున్నారు.
ఇక జిల్లాలో కొత్తగా కేసముద్రం మున్సిపాలిటీ ఏర్పాటు కోసం కృషిచేసిన సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి తొలిసారి మున్సిపల్ పీ ఠాన్ని అధికార కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టడాని కి కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కేసముద్రం పట్టణ అభివృద్ధి కో సం 400 కోట్ల రూపాయలకు పైగా నిధుల ను మంజూరు చేయించడంతోపాటు అన్ని విధాల మౌలిక వసతుల కల్పనకు కృషిచేసి, అధికార పార్టీకి ఓటేయాలని.. అభివృద్ధికి బాటేయాలంటూ పిలుపునిస్తున్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పాగా వేయ డానికి అధికార కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది.
ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఐదు మున్సి పాలిటీలో తమ సత్తాను చాటి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి పుంజుకునే విధంగా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలో 98 వార్డు కౌన్సిలర్ పదవులను ఎవరికివారు కైవసం చేసుకోవడానికి ఏమాత్రం తీసిపోని విధంగా గట్టి పో టీ ఇస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ పోరిక బలరాం నాయక్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
బీఆర్‌ఎస్ గెలుపు కోసం ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలోత్ కవిత ప్రచారం సాగించారు. ఇరు పార్టీలు వార్డుల వారిగా, మున్సిపాలిటీల వారిగా ప్రత్యేక పరిశీలకులను నియమించి గెలుపోటములపై ఎప్పటికప్పుడు బేరీజు వే సుకుంటూ వ్యూహ ప్రతి వ్యూహాలతో ముం దుకు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సారి బీజేపీ కూడా దాదాపు అన్ని స్థానాలకు పోటీ చేస్తూ ఎన్నికల బరిలో నిలిచి, ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తోంది.
ఎమ్మెల్యే దంపతులకు ప్రతిష్టాత్మకం
మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూ క్యా మురళి నాయక్ ఆయన సతీమణి డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్యా ఉమ దంపతులకు మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. మహబూబాబాద్ ఎమ్మెల్యేగా మురళి నాయక్ తన నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్, కేసముద్రం మున్సి పాలిటీల్లో పార్టీ విజయం కోసం శ్రమిస్తుండగా,
ఆయన సతీమణి ఉమ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని మరిపెడ, డోర్నకల్, తొర్రూరు మునిసిపాలిటీల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జయాపజయాలు వీరిద్దరికీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్నాయి.
కూతురి గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆరాటం
మహబూబాబాద్ మున్సిపాలిటీ చైర్ ప ర్సన్ పదవి ఎస్టీ జనరల్ కు కేటాయించగా తన కూతురు తేజస్విని ని మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ రంగంలోకి దింపా రు. గత అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మురళి నాయక్ చేతిలో 50వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో ప రాజయం పాలు కాగా, మహబూబాబాద్ మున్సిపాలిటీలో సైతం బీఆర్‌ఎస్ భారీగా మెజార్టీ తగ్గింది.
ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో తన కూతురు విజయంతో మున్సిపాలిటీలో తిరిగి టిఆర్‌ఎస్ జండా ఎగరవేసి మానుకోటపై మళ్లీ పట్టు సాధించాలని శంకర్ నాయక్ తలపోస్తున్నారు. అయితే మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 18 కి పైగా వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవాల్సి ఉంటుంది.
రెండుగా విడిపోయిన వామపక్షాలు
గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన వామపక్ష పార్టీలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో రెండుగా విడిపోయాయి. సీపీఐ హస్తం దోస్తీ వీడి కారెక్కగా, సీపీఎం కాంగ్రెస్తో దోస్తీ కట్టింది. వామపక్ష పార్టీల మద్దతుతో తమదే విజయం అని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.