6 May, 2026 | 10:35 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

తిరిగొచ్చిన నెక్లెస్

09-08-2025 12:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

* నెక్లెస్‌ను చూడగానే నా కళ్లు చెమర్చాయి. శ్రావణి కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. వెంటనే అమ్మాయి తన పాపకు ఆ నెక్లెస్ ఉండాలని కోరింది. అన్నదమ్ములందుకు ఒప్పుకున్నారు. తనచేతికి తిరిగొచ్చిన ఆ బంగారు నెక్లెస్‌ను శ్రావణి తన కూతురు శ్రేష్ఠ మెడలో అలంకరించడం కొసమెఱుపు. నా మనుమరాలి కంఠంలో ఆ నెక్లెస్‌ను చూసిన నేను తిరిగి ప్రమీల ఆ నెక్లెస్‌ను ధరించినంత ఆనందానుభూతిని పొందాను.

లోకంలో సాధారణంగా పాత వస్తువుల్ని పారేస్తుంటాం. లేకపోతే ఎవరికైనా ఉచితంగా ఇస్తుంటాం. కానీ బంగారు నగలను మాత్రం దాచుకుంటాం పాతవైతే కరిగించి కొత్తనగల్ని తయారు చేసుకుంటాం. కానీ ఎవరూ బంగారు నగల్ని దానం చెయ్యరు. పూర్వకాలంలో మన పల్లెటూర్లలో ఈ రోజుల్లో లాగా స్త్రీలు కమ్మలు వగైరా ఆభరణాలు ధరించేవారు కారు. గంటీలు ధరించడం పాతకాలం స్త్రీలకు అలవాటు. అట్లే కంటె లు, వడ్డాణాలు, కాళ్లకు కడియాలు వాళ్లకు ముఖ్యమైన ఆభరాణాలుగా భావిస్తారు.

దివంగతురాలైన మా అమ్మగారి గంటీల ను తెలిసి ఉన్న జ్యూవెలరీ షాపులో ఇచ్చి, బదులుగా నెక్లెస్ కొన్నాను. ఒక ఆభరణాన్ని కరిగిస్తే మరొక ఆభరణం తయారు అవుతుంది. అది బంగారం, వెండి నగల ప్రత్యేకత, అట్లా మా అమ్మగారి చెవి గంటీ లు మా ఆవిడ మెడలో నెక్లెస్‌గా మారింది. ఐతే దానికి అదనంగా కొంత డబ్బు ఇవ్వవలసి వచ్చింది. ఆ నెక్లెన్‌ను మా ప్రమీల చాలా కాలం ధరించింది. ఆమె దాన్ని ధరించినప్పుడు నాకు మా అమ్మే గుర్తుకు వచ్చింది. 

మిత్తి లేకుండానే నగదు

మా అమ్మాయి శ్రావణికి ఎమ్మెస్సీ చదువుతుండగానే పెళ్లి సంబంధం వచ్చిం ది. అబ్బాయి నాగరాజు, సంప్రదాయ కుటుంబం, అబ్బాయి తండ్రి కట్నం అవసరం లేకుండానే పెళ్లి నిశ్చయించాడు. ఐతే పెళ్లి ఒక వారం రోజుల్లోనే జరగాలనే కండీషన్ పెట్టాడు. పెళ్లి చూపులకు వచ్చి రాగా నే అబ్బాయి తండ్రి సత్యనారాయణ అంత తొందరగా మా అమ్మాయిని తన కోడలి గా చేసుకోవడానికి ఒక కారణం ఉంది.

నా భార్యది గౌలిపురా. ఆమె సుల్తాన్‌సాయి స్కూల్లో చదివింది. ఆమె ప్రైమరీ స్కూల్లో ఉండగా వారు హెడ్మాస్టర్‌గా పనిచేశారు. అట్లా పూర్వ పరిచయం కలిగి ఉండడమే గాక, అప్పుడప్పుడు సాహిత్య సభలలో వారు నాతో కలిసి పాల్గొనడం వల్ల బంధుత్వానికి మార్గం సుగమమైంది. సద్వర్త నుడైన సత్యనారాయణ గారి అబ్బాయి మా అమ్మాయిని పెళ్లాడి పదిరోజుల్లో అమెరికా వెళ్లిపోవాలి. నాకు బీపీ వచ్చినం త పనైంది.

నాకంత తొందరగా పెళ్లి చేయ డం ఇబ్బందిగానే ఉంది. కట్నం క్యాష్ రూపంలో ఎట్లా ఇవ్వకున్నా బంగారమైనా పెట్టాలికదా! ప్రమీలతో మాట్లాడాను, ఆమె తన - పెద్ద గొలుసును, నెక్లెస్ (రాళ్లులేనిది)ను అమ్మాయికి ఇవ్వడానికి ఒప్పు కుంది. నేనూ సంతోషించాను. మా ఇంటి ముందు శివయ్యగారు ఒక చిన్న చిల్లర కొట్టు నడుపుకుంటున్నాడు.

నేను ఏదో కొనడానికి పోతే, ‘ఏం సార్ మీరు కొంచెం విచారంగా కనిపిస్తున్నారు. కారణం తెలుసుకోవచ్చా? అని అడిగాడు. నేను అమ్మాయికి వారంలోనే పెళ్లి చేసే విషయాన్ని ఆయనకు చెప్పాను. ‘చాలా సంతోషం. మీకేమైనా డబ్బు సర్దమంటే సర్దుతాను ‘ అని ఆయనే స్వయంగా అనడం, నేను రెం డు లక్షలు ఆయన దగ్గర మిత్తి లేకుండానే తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. 

రిటైర్మెంట్ అయిన కొన్నాళ్లకే విషాదం

పెళ్లి బాగా జరిగింది. అబ్బాయి పెళ్లి తర్వాత నాలుగు రోజులుండి యూఎస్ వెళ్లిపోయాడు. అమ్మాయి శ్రావణి కూడా నాలుగు నెలల తర్వాత యూఎస్ వెళ్లిపోయింది. శ్రావణికి పెళ్లైన రెండేళ్లకు శ్రేష్ఠ జన్మించింది. శ్రేష్ఠ రెండేళ్లు ఇండియాలోనే పెరిగింది. తన కూతురిని తీసుకుపోవడానికి శ్రావణి, నాగరాజు ఇండియాకొ చ్చారు. శ్రావణికి నగలంటే వల్లమాలిన ప్రేమ. పాత నగల్ని కరిగించి కొత్తవి చేయించుకోవడం గాని, పాతవి అమ్మేసి కొత్తవి కొనడం గాని ఆమెకిష్టం.

ఒకరోజు శ్రావణి నన్నూ, ప్రమీలనూ అబిడ్స్‌లోని జ్యూవెల్లరీ షాప్‌కు తీసుకొని వెళ్లింది. కొత్త నగలకు ఆర్డర్ ఇస్తూ, పెళ్లి నాడు ప్రమీల నుంచి తనకు కట్నంగా వచ్చిన నెక్లెస్‌ను అమ్మే ప్రయత్నం చేసింది. అయ్యో! నేను ప్రేమతో ప్రమీలకు చేయించిన నెక్లెస్‌ను శ్రావణి షాపు వాడికి అమ్మేయడం నాకు బాధ కలిగించింది. షాపువాడు వెంటనే ఆరువేలకు ధరకట్టి తీసుకున్నాడు. ఒక్క క్షణంలో నాకు మంచి ఆలోచన వచ్చింది. నేను ఆ నెక్లెస్‌ను తీసుకుంటే ఎంతో బాగుంటుందనిపించింది.

ఆలస్యం చేయకుండా నా దగ్గరున్న ఆరు వేలు షాపత నికిచ్చి నెక్లెస్‌ను తీసుకున్నాను. నేను చేసిన పనికి ప్రమీల ఏమనుకున్నదోగాని, శ్రావ ణి మాత్రం కొంచెం సిగ్గు పడినట్లు కనిపించింది. శ్రావణి వివాహమై పదిహేనేండ్లు గడిచాయి. అది 2015వ సంవత్సరం. నేను రిటైర్మెంట్ అయిన మూడు మాసాలకే అకస్మాత్తుగా ప్రమీల నన్ను శోక సముద్రంలో ముంచి పరలోకానికేగింది. 

సామరస్యంగా పంచుకున్నారు..

కొన్ని రోజులు గడిచాయి. ప్రమీల రెండు అల్మారాల నిండా చీరలే. ప్రత్యేకంగా నగల పెట్టె కూడా ఉంది. నా పిల్లలు ముగ్గురు అల్మారాలు తెరిచారు. నా అనుమతితో చీరలూ, నగలు వారికి ఇష్టమైన రీతిలో పంచుకున్నారు. ముగ్గురూ సామరస్యంగా నగల్ని పంచుకోవడం నాకూ బాగనిపించింది! ఆశ్చర్యమేమంటే ప్రమీల ధరించిన ఆభరణాల్లో శ్రావణి అమ్మితే నేను కొన్న నెక్లెస్ కూడా ఉంది. ఆ నెక్లెస్‌ను చూడగానే నా కళ్లు చెమర్చాయి.

శ్రావణి కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. వెంటనే అమ్మాయి తన పాపకు ఆ నెక్లెస్ ఉండాలని కోరింది. అన్నదమ్ములందుకు ఒప్పుకున్నారు. తనచేతికి తిరిగొచ్చిన ఆ బంగారు నెక్లెస్‌ను శ్రావణి తన కూతురు శ్రేష్ఠ మెడలో అలంకరించడం కొసమెఱుపు. నా మనుమరాలి కంఠంలో ఆ నెక్లెస్‌ను చూసిన నేను తిరిగి ప్రమీల ఆ నెక్లెస్‌ను ధరించినంత ఆనందానుభూతిని పొందాను.