calender_icon.png 20 December, 2025 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త సినిమా షురూ

16-12-2025 01:53:25 AM

బాబీ సింహా, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్‌గా మెహర్ యరమతి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. యువ ప్రొడ క్షన్స్ బ్యానర్‌పై యువకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైయింది. ఈ వేడుకలో టాలీవుడ్ నిర్మాతలు ఎస్‌కేఎన్, వంశీ నందిపాటి, సినిమా యూనిట్ అంతా పాల్గొన్నారు. డిసెంబర్ 22 నుంచి షూటింగ్ ప్రారంభించనున్నట్టు నిర్మాతలు తెలిపారు.

ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ కృష్ణదాస్ డీవోపీగా పనిచేస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ సదాశివుని సంగీతం సమకూర్చుతుండగా, వివేక్ అన్నామలై ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.