calender_icon.png 20 December, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విష్ణు విన్యాసం ఫిబ్రవరిలో..

16-12-2025 01:52:19 AM

హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో యూనిక్  ఎంటర్‌టైనర్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జీ నిర్మిస్తున్నారు. ఇందులో నయన్ సారిక కథానాయికగా నటిస్తుండగా సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేశ్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. రెండు పాటల చిత్రీకరణే మిగిలివుంది. అయితే, మూవీటీమ్ సోమవారం ఒక యానిమేషన్ వీడియో ద్వారా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. అర్బన్ సెటప్‌లో సాగే ఈ గ్లింప్స్‌లో, కస్టమ్ యెల్లో మోటార్‌సైకిల్‌పై నగర వీధుల్లో దూసుకెళ్తున్న శ్రీవిష్ణు మొదటి ఫ్రేమ్ నుంచే అలరించారు. ఈ సినిమాకు ‘విష్ణు విన్యాసం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

టైటిల్ రివీల్‌కు ‘నో బ్రేక్స్ లాఫ్స్’ అనే క్యాచీ ట్యాగ్‌లైన్ మరింత అలరించింది. ‘చరిత్ర, సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం అన్నీ అతని కోసమే కనుగొనబడ్డాయి’ అంటూ వినిపించే ప్లేఫుల్ వాయిస్ ఓవర్ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రాన్ని 2026 ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నట్టు ఈ టైటిల్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్; సంగీతం: రధన్; ఆర్ట్: ఏ రామాంజనేయులు; ఎడిటర్: కార్తికేయన్ రోహిణి.