16-12-2025 01:54:28 AM
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్‌సేన్, హాస్య చిత్రాలకు చిరునామా గా మారిన దర్శకుడు కేవీ అనుదీప్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘ఫంకీ’. కథానాయిక కయాదు లోహర్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. నరేశ్ వీకే, వీటీవీ గణేశ్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా థియేటర్లలో ఈ చిత్రం సందడి మొదలుకానుంది.
ఈ సినిమాను 2026, ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. తొలుత ఈ సినిమాను 2026 ఏప్రిల్‌లో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. ఇప్పుడు విడుదల తేదీ ముందుకు జరగడంతో.. కాస్త ముందుగానే ప్రేక్షకులు ఈ వినోదాల విందుని ఆస్వాదించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి రచన: అనుదీప్ కేవీ, మోహన్; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; కూర్పు: నవీన్ నూలి; ఛాయాగ్రహణం: సురేశ్ సారంగం; కళా దర్శకుడు: జానీ షేక్.