17 April, 2026 | 8:55 AM

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన అడవి శ్రీరాంపూర్ నూతన పాలకవర్గం

16-12-2025 08:10 PM

ముత్తారం (విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ నూతన పాలకవర్గం సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్ లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ అడిగి శ్రీరాంపూర్ సర్పంచ్ గా భారీ మెజార్టీ(1078) సాధించినందుకు కష్టపడ్డ, ప్రతి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు పేరుపేరునా అభినందనలు తెలిపారు. గ్రామ ప్రజలు మనపై చూపిన ఆదరాభిమానాలకు ఇకనుంచి అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజల మన్నలను, ఆశీస్సులను పొందాలని మంత్రి సూచించారు. సర్పంచ్ ను అధికం మెజారిటీతో గెలిపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను, గ్రామ ప్రజలను శ్రీధర్ బాబు అభినందించారు.