calender_icon.png 17 December, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ చైతన్య ఇంటర్నేషనల్ స్కూల్లో సీబీఎస్ఈ వర్క్ షాప్

16-12-2025 08:07:01 PM

ఖమ్మం టౌన్ (విజయక్రాంతి): శ్రీ చైతన్య ఇంటర్నేషనల్ స్కూల్ సీబీఎస్ఈ ఖమ్మం నందు సీబీఎస్ఈ రిసోర్స్ పర్సన్స్ చే ఘనంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ - 2020 మీద వర్క్ షాప్ నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ చైతన్య యాజమాన్యం మల్లంపాటి శ్రీవిద్య, మల్లంపాటి శ్రీధర్ లు పాల్గొన్నారని తెలిపారు. వర్క్ షాప్ లో భాగంగా ఎన్ ఈ పి - 2020లో ఉన్నటువంటి పూర్తి విషయాలను క్షుణ్ణంగా వివరించి, స్కూల్ ని రోజు వారిగా ఎలా నిర్వహించాలి, రాబోయే తరాలకు అనుగుణంగా స్కూల్ ని ఎలా రూపొందించుకోవాలి అనే విషయాన్ని కూలంకశంగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ నాగప్రవీణ, అకాడమిక్ డీన్, ఇంచార్జ్ లు, విభాగాధిపతులు, ఉపాధ్యాయ బృందం, సీబీఎస్ఈ రిసోర్స్ పర్సన్స్ పూర్ణాదేవి శ్రీవత్సవ ప్రిన్సిపల్ జి హై స్కూల్, హైదరాబాద్, సిద్ధయ్య, తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.