calender_icon.png 13 November, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరికొత్త ట్రెండ్!

30-07-2024 12:05:00 AM

ఫ్యాషన్ దుస్తులతో పాటు జ్యువెలరీలోనూ కొత్త ట్రెండ్స్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే మార్కెట్లో మెరిసి పోతున్న ఈ సరికొత్త నగల్ని ప్రయత్నించి చూడండి. ఈ తరం మనసును దోచేస్తున్నాయి!

అమ్మాయిల మెడని చుట్టి అం దాల ఆభరణంగా మారాల్సిందేనంటూ డిజైన్లరు సరికొత్త జ్యువెల రీని తీసుకొస్తుంటారు. అందులో భాగంగా కొత్తగా డిజైన్ చేసినవే ఇక్కడున్న ఈ పూసల పెండెంట్లు. అందమైన బంగారు డిజైన్ల వెనక రంగు రంగుల పూసల వరసల్ని జోడిస్తూ.. లాకెట్టునే చక్కని కళా చిత్రంలా తీర్చిదిద్దుతున్నారు.  కొం చెం సంప్రదాయంగా, మరికొంచెం ట్రెండీగానూ కనిపించే ఈ పెండెంట్లని ఇటు పూసలూ కలగలిసిపోతూ మెరిసే ఈ నగలు తక్కువ బంగారంతోనే ఓ చక్కని ఆభరణం చేసుకోవా లనుకునే వారికి తప్పక నచ్చేస్తాయి!