calender_icon.png 13 November, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాంట్ లవర్స్ కోసం..

30-07-2024 12:05:00 AM

ఇంట్లో ఉన్న కొంచెం చోటులోనే పూలూ, పండ్లు, కూరగాయలూ, మొక్కలూ పెంచుకుంటున్న ప్లాంట్ లవర్స్ పెరిగిపోయారు. అలాంటి వారి కోసమే ఎప్పటికప్పుడు వెరైటీ మొక్కల్లోనే కాదు. వాటిని పెంచే కుండీల్లోనూ కొత్తదనం కనిపిస్తున్నది. ఇక్కడున్న ‘గార్డెన్ బెడ్స్’ అలా వచ్చినవే మరి. కింద నచ్చిన మొక్కల్ని నాటుకోవడంతో పాటు పై నుంచి కుండీల్ని వేలాడదీసుకునేలా, ఇంకా తీగల మొక్కలు పైకి పాకేలానూ దీంట్లో వర్టికల్ వాల్ ఏర్పాట్లు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రకరకాల మొక్కలతో ఇదే ఒక చిట్టితోటలా తయారవతుంది. తక్కువ స్థలంలోనూ అందమైన బాల్కనీ కావాలనుకునేవాళ్లు ఎంచక్కా దీన్ని కొనుక్కోవచ్చు. దీంట్లో రకరకాల సైజులూ, ఆకారాలూ అందుబాటులో ఉన్నాయి. పైగా వీటిల్లో కొన్ని నచ్చిన చోటుకు జరిపేలా చక్రాలతోనూ వస్తాయి. ఈ ఒక్క గార్డెన్ బెడ్ మీ బాల్కనీకి చక్కని అందాన్ని తీసుకోస్తుంది.