02-12-2025 08:46:00 PM
కోదాడ: కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేయడానికి పెద్దఎత్తున అభ్యర్థులు హాజరయ్యారు. దీంతో అధికారులు అభ్యర్థులకు టోకెన్లను జారీ చేసి నామినేషన్ వేయడానికి పంపిస్తున్నారు. అభ్యర్థులు అధిక సంఖ్యలో రావడంతో చీకటి పడిన నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అర్ధరాత్రి వరకు అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. అభ్యర్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు అధికారులు కల్పిస్తున్నారు.