02-12-2025 08:48:34 PM
మంథని (విజయక్రాంతి): హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మంగళవారం నిర్వహించిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో నూతన డీసీసీ అధ్యక్షులు, పూర్వ డీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్ పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షులకు పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు నూతన అధ్యక్షులు కృషి చేయాలన్నారు.