calender_icon.png 4 October, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోలికొస్తే విశ్వరూపం చూపే ఉత్తర

04-10-2025 12:41:22 AM

శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నటుడు శివాజీ నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రంలో నటి లయ ముఖ్య పాత్రను పోషిస్తోంది. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా నుంచి దసరా ప్రత్యేకంగా నటి లయ పోషించిన పాత్రను పరిచయం చేశారు. లయ ఈ చిత్రంలో ఉత్తర అనే గృహిణి పాత్రను పోషిస్తున్నారు. బయటకి సాధారణ మహిళగా కనిపిస్తూనే, లోపల క్రిమినల్ నేచర్ ను దాచిపెట్టుకుంటూ..

రెండు రకాల మనస్తత్వాలతో సాగే ఈ పాత్రలో లయ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారని చిత్రబృందం తెలిపింది. తన కుటుంబం జోలికి వస్తే, ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడే వ్యక్తిగా, మల్టిపుల్ షేడ్స్ ఉన్న ఇలాంటి పాత్రలో లయ కనిపించబోతున్నారు. తాజా పోస్టర్‌లో లయను, చేతిలో ఆయుధాలను చూస్తే ఆమె పాత్రలో ఎన్ని షేడ్స్ ఉంటాయో అర్ధం అవుతుంది. ఇక ఈ మూవీకి మిథిల్ కుమార్, సుధీర్ శ్రీరామ్ కథను అందించారు. రిత్విక్ రెడ్డి కెమెరామెన్గా, రంజిన్ రాజ్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.