calender_icon.png 4 October, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నయనతార.. మహాశక్తి

04-10-2025 12:40:34 AM

నయనతార లీడ్ రోల్‌లో సుందర్ సీ దర్శకత్వంలో వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, ఐవీ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘మూకుతి అమ్మన్ 2’. మూకుతి అమ్మన్ పార్ట్ 1 భారీ విజయాన్ని సాధించింది, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ’అమ్మోరు తల్లి’కి  బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ లభించింది. దసరా సందర్భంగా ‘మూకుతి అమ్మన్ 2’ తెలుగు టైటిల్ ని ప్రకటించారు. ఈ చిత్రం తెలుగులో ‘మహాశక్తి’ టైటిల్ తో రానుందని తెలిపారు.

ఈ మేరకు అమ్మవారి రూపంలో నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో నయనతార లీడ్ రోల్‌లో నటిస్తుండగా, దునియా విజయ్, రెజీనా కాసాండ్రా, యోగిబాబు, ఊర్వశి, అభినయ, రామచంద్ర రాజు, అజయ్ ఘోష్, సింగం పులి, విచ్చు విశ్వనాథ్, ఇనియా, మైనా నందిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానున్న ఈ చిత్రానికి హిప్ హాప్ ఆది సంగీతం అందిస్తున్నారు. గోపీ అమర్నాథ్ సినిమాటోగ్రాఫర్‌గా ఫెన్నీ ఆలివర్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.