calender_icon.png 4 October, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లి పీటలెక్కనున్న విజయ్ దేవరకొండ రష్మిక

04-10-2025 01:13:32 AM

  1. అతి తక్కువమంది బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక!
  2. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కలిసి నటించిన జంట
  3. ఈ క్రమంలోనే వారి మధ్య స్నేహం.. క్రమంగా ప్రేమబంధం
  4. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా వివాహం

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): యంగ్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లిపీటలెక్కబోతున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమపై ఎప్పటి నుంచో టాలీవుట్‌లో చక్కర్లు కొడుతున్న ఊ హాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఈ జంట ఒక్కటి కానున్నది. తాజాగా అతి తక్కువమంది బంధుమిత్రుల సమక్షంలో గోప్యం గా నిశ్చితార్థ వేడుక జరిగినట్లు తెలిసింది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహబంధం మాత్రమే కాదని, ప్రేమబంధమనేది కూడా తేలిపోయింది. అయితే.. ఈ వేడుకపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో వీరిద్దరూ తళుక్కున మెరిశారు. ఆ చిత్రాల షూ టింగ్ సమయంలోనే వీరు మంచి స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్తా క్రమంగా ప్రేమ గా మారింది. అప్పటి నుంచి వీరిద్దరూ డే టింగ్‌లో ఉన్నారంటూ మీడియాలో విస్తృతంగా కథనాలు ప్రసారమయ్యాయి. అనేక సార్లు ఇద్దరూ కలిసి విహారయాత్రలకు కలిసి వెళ్లడం, ఒకే రకమైన దుస్తుల్లో కనిపించడంతో ఆ ఊహాగానాలకు బలం చేకూరింది. వీరిద్దరి చిత్రాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, తమ బంధంపై ప్రసారమైన కథనాలపై.. ఇద్దరూ ఎప్పుడూ నేరుగా స్పందించలేదు.

మీడియా సంధిస్తున్న ప్రశ్నలను ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇరు కుటుంబాల పూర్తి అంగీకారంతోనే నిశ్చితార్థ వేడుక జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా వివాహం నిర్వహించేందుకు రెండు కుటుంబాలు సిద్ధమవుతు న్నట్లు తెలిసింది.

త్వరలోనే ఆ శుభవార్తను విజయ్, రష్మిక అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక కెరీర్ పరంగా ఇద్దరూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘పుష్ప 2’, ‘ఛావా’ చిత్రాలతో రష్మిక భారీ విజయాలు అందుకోగా, విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమా కూడా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. వీరిద్దరూ వ్యక్తిగత జీవితంలోనూ ఒక్కటి కాబోతుండటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.