calender_icon.png 5 February, 2026 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీలో ప్రతిజ్ఞా పర్వం

05-02-2026 12:00:00 AM

గెలిచిన తరువాత పార్టీ వీడను

బీజేపీలోనే ఉంటా....కరీంనగర్ ప్రజలకు అంకిత భావంతో సేవ చేస్తా

కరీంనగర్, ఫిబ్రవరి 4(విజయక్రాంతి): అయారాం గయారాం సంస్క్రుతితో రాజకీయాలు కంపుకొడుతున్న ఈ తరుణంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులతో గత మూడు రోజులు గా వినూత్న రీతిలో ప్రతిజ్ఝ చేయిస్తున్నారు. గెలిచిన తరువాత పార్టీని వీడబోనని, పార్టీకి అంకిత భావంతో పనిచేస్తానని, కరీంనగర్ అభివ్రుద్ధితోపాటు దేశం కోసం, సమాజం కోసం పనిచేస్తానని ప్రతిజ్ఝ చేయి స్తున్నారు.

తొలిరోజు తొలిరోజు కిసాన్ నగర్, కాపువాడ మారుతీనగర్ చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో 5 డివిజన్ల బీజేపీ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించిన బండి సంజయ్ రెండో రోజు కోతిరాంపూర్ చౌరస్తా, పాత లేబర్ అడ్డా వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచార స భలో... 9, 39. 40, 62, 63, 64 డివిజన్లలో బుధవారం సిరిసిల్ల , వేములవాడ పట్టణాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులతో ప్రతిజ్ఝ చేయించడం గమనార్హం.