14 April, 2026 | 1:20 PM

Breaking News

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •   డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి   •   ఒంగోలు దారుణ ఘటన: బతికుండగానే తల్లికి నిప్పు పెట్టిన కుమారుడు!   •  

ఓటుతోనే కాంగ్రెస్‌కు వేటుపడాలి

05-02-2026 12:00 AM

సూర్యాపేటలో మాట్లాడుతున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి) : ఓటు ఆయుధంతోనే కాంగ్రెస్ కు వేటు పడాలని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సూర్యాపేటలోని 6, 5, 31, 3, 22, 39 వార్డుల్లో ప్రచారం ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధికి కేరఫ్ గా ఉన్న బీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించాలన్నారు.

ఏం సాధించి ఓటు అడుగుతున్నారని కాంగ్రెసోళ్లను నిలదీయాలన్నారు. రోడ్లన్నీ చెత్త, కరెంట్ కోతలు, మురుగు దుర్వాసన, దోమల బెడద ఇదే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి అన్నారు. ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్ అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఇద్దరు మంత్రులు కూడా అరాచక శక్తులనే ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇప్పటిదాకా అభ్యర్థులను, ఇప్పుడు ప్రజలను భయపెట్టే పనిలో పడ్డారన్నారు. బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ పెడుతున్న ఇబ్బంది కండ్ల ముందే కనబడుతుందన్నారు.

రౌడీ రాజకీయాలకు, సిండికేట్ దంధాలు మళ్లీ మొదలైనయన్నారు. అటువంటి అరాచక శక్తులను అధిలోనే అంతమోందించాలన్నారు. అందుకు ఓటే సరైన ఆయుధమన్నారు. బీఆర్‌ఎస్ ప్రచారానికి పట్టణ ప్రజలు అడుగడుగునా బ్రహ్మరధం పడుతున్నారన్నారని ఇదే ఉత్సాహంతో అన్ని వార్డుల్లో ముందుకు సాగాలన్నారు.

నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు సమన్వయంతో పనిచేసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి మరొమారు చైతన్యాన్ని చాటాలన్నారు. అనంతరం ఆయా వార్డుల నుండి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లను వీడి పార్టీలో చేరుతున్న వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డులలో పోటీలో నిలిచిన అభ్యర్థులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.