6 April, 2026 | 8:17 AM

అక్రమ కేసులపై ఉన్న మోజు.. ఆరోగ్యశాఖపై లేదు

30-10-2024 02:34 AM

రేవంత్‌రెడ్డి సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాం తి): రేవంత్‌రెడ్డి సర్కార్‌కు అక్రమ కేసులపై ఉన్న మోజు ఆరోగ్య శాఖపై లేదని, అడ్డగో లు సంపాదనపై మోజు.. పెద్దాసుపత్రుల ఆలనాపాలనా మీద లేదని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.

మంగళవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ కుటిల రాజకీయాలపై ఉన్న ప్రేమ.. రోగుల కష్టాల పై ఏమాత్రం లేదన్నారు. ముళ్ల కంచెలపై ఉన్న మోజు ఆసుపత్రుల్లో మందుల కొరతపై పెట్టడం లేదని మండిపడ్డారు. పోలీసు ఉద్యోగాలు పీకడంపై పెట్టిన దృష్టి ఆసుపత్రు ల్లో సిబ్బంది నియమాకంపై పెట్టడం లేదని అన్నారు.

గుండె పట్టేస్తుందని ఆయాసంగా ఉందని వస్తే  పక్కనున్న ప్రైవేటు ఆసుపత్రులకు పొమ్మంటున్నారని, పైసలే ప్రామాణిక మైన రేవంత్ పాలనలో అన్ని రంగాల్లో ఆవేదనలు, అవస్థలు, అన్యాయాలే జరుగుతు న్నాయని ఆరోపించారు. 

రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌పై మరిన్ని వేధింపులు.. 

అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ సర్కా ర్, రేవంత్‌రెడ్డి వైఫల్యాలను, అవినీతి ఎత్తిచూపినందుకు బీఆర్‌ఎస్‌పై ఫ్రస్టేషన్‌లో, డేస్పరేషన్‌లో ఉన్నారని కేటీఆర్ మండిపడ్డా రు. తమ పార్టీపై చేస్తున్న రాజకీయ వేధిం పుల ప్రహసనంలో గత రెండు రోజుల్లో జరిగిన పరిణామాలన్నీ ప్రారంభం మాత్రమేన ని అన్నారు.

రానున్న రోజుల్లో తమపై మరి న్ని వేధింపులు ఉంటాయని, మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులకు, సోషల్ మీడియా వారి యర్లకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ చేసే వ్యక్తిగత దాడులను, కుట్రలను, ప్రాపగాండను, అబద్దాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కాంగ్రె స్ కుట్రపూరితంగా డీప్ ఫేక్ టెక్నాలజీ వంటి  సహకారంతో వారి పెయిడ్ ఆర్టిస్టులతో చేసే దుర్మార్గపూరిత కుట్రలు చూడాల్సి వస్తుంద ని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ సోషల్ మీడియా అంతా కలిసి బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేయబోతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి కుటిల ప్రయత్నాలతో అయోమయానికి గురికావడం, ఆగం కావడం మనకు అవస రం లేదన్నారు.

ప్రజాసమస్యలపై చేస్తున్న పోరాటం నుంచి పక్కకు జరగవద్దని కార్యకర్తలకు సూచించారు.  ప్రజల కోసం చేస్తున్న మౌన పోరాటంపై దృష్టి పెట్టాలని, కాంగ్రెస్ అవినీతి, అసమర్థతను, హిపోక్రసీని ఎత్తిచూపు దామని పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీ లు, 420 హామీల అమలు కోసం ఒత్తిడి తీసుకొద్దామని తెలిపారు. 

కాంగ్రెస్, బీజేపీల మధ్య క్విడ్ ప్రోకో..  

కాంగ్రెస్, బీజేపీ మధ్య క్రిడ్ ప్రోకో ఉంద ని కేటీఆర్ ఆరోపించారు. గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసాలపై ఈడీ దాడులు జరిగితే ఎందుకు బయటకు వెల్లడించలేదని కేటీఆర్ నిలదీశారు. దాడులు జరిగి నెల రోజులు గడుస్తున్నా  దాడులపై ఆ రెండు పార్టీల నాయకుల నుంచి ఒక్క మాట కూడా రాలేదన్నారు.

ఈడీ దాడుల్లో భారీగా డబ్బు దొరికినట్లుగా మీడియా ప్రచారం చేసినా ఎందుకు కేసు నమోదు చేయలేదని నిలదీశారు. ఈడీ దాడులు ముగిసిన తరువాత హైదరాబాద్‌లో ఆదానీ తో మంత్రి పొంగులేటి రహస్యంగా సమావేశయ్యారని, ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య క్విడ్ ప్రోకో కాక మరేమిటని ప్రశ్నించారు.