స్పెషల్ పోలీసులు అంటే రాష్ట్రానికి మిలిటరీ
- సీఎం సెక్యూరిటీ నుంచి తప్పించడం ఆనాలోచిత నిర్ణయం
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాం తి): స్పెషల్ పోలీసులు అంటే రాష్ట్రానికి మిలిటరీ లాంటి వారని, సీఎం రేవంత్‌రెడ్డి తన వ్యక్తిగత భద్రత నుంచి స్పెషల్ పోలీసులను తప్పించడం అనాలోచిత నిర్ణయమని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
మంగళవారం ఎక్స్‌వేదికగా స్పందిస్తూ 17 వేల మంది స్పెషల్ పోలీసులను తన చర్య తో అవమాన పరిచారని, వారి ఆత్మస్థుర్యై న్ని దెబ్బతీయకూడదని, తండ్రి కొడుకులను విశ్వాసంలోకి తీసుకోనట్లుగా ఉందన్నారు. స్పెషల్ పోలీసుల సమ స్యల పరిష్కారానికి సీఎం తక్షణమే కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పా టు చేసి, నిర్ణీత కాలవ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఏక్ పోలీస్ విధానా న్ని తీసుకువస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు స్పెషల్ పోలీసుల ఆందోళనపై కనీ సం స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సస్పెండ్, డిస్మిస్ అయిన స్పెషల్ పోలీసు కానిస్టేబుళ్లను తక్షణమే విధుల్లోకి చేర్చేందుకు రేవంత్ జోక్యం చేసుకోవాలని సూచించారు. సచివాలయ ముఖ్య భద్రతా అధికారి ఎమర్జెన్సీ తరహాలో ఆంక్షలు పెడుతూ విడుదల చేసిన సర్క్యూలర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో తగ్గిన కొత్త కంపెనీలు
కాంగ్రెస్ పాలనలో కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గాయని మంగళవా రం ఒక ప్రకటనలో హరీశ్‌రావు పేర్కొన్నా రు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం.. 2023-24తో పోలిస్తే 2024--25 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు తెలంగాణలో గణనీయంగా తగ్గినట్టు వెల్లడించిందని గుర్తు చేశారు.
ఈ తగ్గుదల ప్ర త్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లు క్షీణించిందని తెలిపిందన్నారు. ఇది తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి గొడ్డలి పెట్టులాంటిదన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పుకుంటుందని, కానీ వాస్తవాలకు భిన్నం గా పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.
కొత్త కంపెనీల సంఖ్య పడిపోవడం, లక్ష్యాన్ని చేరుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శన మన్నారు. ప్రభుత్వ అసమర్థతతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోవడమే కాక ఆర్థిక అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన అసలైన మార్పు అంటూ ఎద్దేవా చేశారు.




