8 March, 2026 | 10:52 AM

పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి

08-03-2026 12:00 AM

ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయుల మహా విజ్ఞాపన నిరసన సభ

ముషీరాబాద్, మార్చి 7(విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సంతోష్ కుమార్, కోశాధికారి గుంటి వేణుగోపాల్, ఇజ్రాయేల్, మహమూద్ పలువు రు నాయకులు డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం జారీచేసిన 57/4, 57/5 మెమోల ప్రకారం రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా పాత పెన్షన్ అమలు చేయాలని కోరుతూ శనివారం హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహా విజ్ఞాపన సభను భారీ స్థాయిలో 2003 డిఎస్సీ ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

ఈ నిరసన సభకు ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, ఏవిఎన్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ జేఏసీ వైస్ చైర్మన్ గుజ్జ కృష్ణ, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీష్, ఎన్జీవోస్ నాయకుడు ముజీబ్ హుస్సేన్, పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షులు పులగం దామోదర్‌రెడ్డి, ఎస్జిటియు అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, టిపియుఎస్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి వోడ్నాల రాజశేఖర్, తెలకపల్లి పెంటయ్య, బిక్షం గౌడ్ లతో పాటు పలువురు నాయకులు హాజరై మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పులిపాక కిషన్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు నల్లా రాజేందర్ రెడ్డి, అంబిలి శంకర్, వెంకటేశం గౌడ్, నాగిరెడ్డి, రాఘవేందర్ గౌడ్, లక్ష్మణ్ ఎల్. అంజుల్ రెడ్డి, కిరణ్, అయ్యప్ప రెడ్డి, వివిధ జిల్లాల 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు.