8 March, 2026 | 12:47 PM

సన్మానం చేసే నైతికత స్వార్థపరులకు లేదు

08-03-2026 12:00 AM

ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌ఎఫ్ నాయకులు

సికింద్రాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): దమ్ముంటే రేవంత్ రెడ్డికి ఎందుకు సన్మానం చేశారో చేయించుకున్న రేవంత్ రెడ్డి, చేసిన స్వార్థపరులు ఇద్దరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఉస్మానియా యూనివ ర్సిటీ ఆరట్స్ కళాశాల ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌ఎఫ్ నాయకులు మండిపడ్డారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందుకు రేవంత్ రెడ్డికి సన్మానం ? అంటూ ప్రశ్నిస్తూ గత నోటిఫికేషన్ల కు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని చెప్పి వర్గీకరణ లేకుండానే 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసి మాదిగ నిరుద్యోగుల కడుపు కొట్టినందుకా?, సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణ చట్టం చేయకుండా మాలలు ఒత్తిడికి తలొగ్గి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి మాదిగలకు అన్యాయం చేసినందుకా? ఎస్సీ వర్గీకర ణలో 11% వాటా రావాల్సిన మాదిగలకు 9 శాతం మాత్రమే కేటాయించి అన్యాయం చేసినందుకా ?,శాసనసభ ఎన్నికల్లో మాదిగలకు రావాల్సిన ఎమ్మెల్యే టికెట్లను తగ్గిం చినందుకా?, లోక్ సభ స్థానాల్లో ఒక్క టికెట్ కూడా మాదిగలకు ఇవ్వకుండా జాతి గొం తు కోసినందుకా?, శాసనమండలి ఖాళీ స్థానాలలో 5లో ఒకటి కూడా మాదిలకు కేటాయించకుండా రాజకీయ దగా చేసినందుకా?,రాజ్యసభ సీటు రెడ్డికి ఇచ్చి మాది గలకు ఇవ్వకుండా మోసం చేసినందుకా?, నామినేటెడ్ పదవుల్లో మాదిగల సంఖ్యను తగ్గించి ప్రభుత్వ పాలన నుండి వెలివేసినందుకా?, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ వర్గీకర ణ ప్రకారం మాదిగ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఇవ్వకుండా వారి ఎదుగుదలను అడ్డుకుంటున్నందుకా ?,కర్ల రాజేష్ మాదిగ లాకప్ డెత్ సంఘటనపై మౌనంగా ఉన్నందుకా?, ఎందుకు సన్మానాలు, ఎందుకు సత్కారాలన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా. గోవిందు నరేష్ మాదిగ, ఎంఎస్‌ఎఫ్ జాతీ య అధ్యక్షులు డాక్టర్ చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ,రాష్ట్ర అధికార ప్రతినిధి డా. కొమ్ము శేఖర్ మాదిగ, జాతీయ కార్యదర్శి డాక్టర్ పల్లెర్ల సుధాకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామారావు శ్రీనివా స్ మాదిగ, రాష్ట్ర నాయకులు వీరపాకుల పరుశురాం మాదిగ, ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బైరపోగు శివకుమార్ మాదిగ, హైదరా బాద్ జిల్లా అధ్యక్షులు జనపాల మహేష్ మాదిగ, కోలా హరీష్ మాదిగ, కనకపుడి మహేంద్ర మాదిగ, దూడ వంశీ మాదిగ, నర్సింగరావు మాదిగ,వెంకటేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.