జీవితాన్ని మార్చే ఆయుధం విద్య
టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారం మండలం చీకటి మామిడి గ్రామంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్స వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చీకటి మామిడి సర్పంచ్ నాగరాజు గౌడ్ ఆహ్వానం మేరకు హాజరై, మాట్లా డారు.
చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ముందుండాలని సూచించారు. విద్య అనేది మన జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధం అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు, అధికారులు త యారవుతారని, అందుకోసం విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని తమ లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు. కార్యక్రమం చివరలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మల్లన్న చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.




