19 April, 2026 | 1:51 AM

పాత కరెన్సీ మార్పునకు అవకాశం అవాస్తవం

19-04-2026 12:05 AM
  1. ఫేక్ ప్రచారం నమ్మొద్దు

స్పామ్‌లతో జాగ్రత్తగా ఉండాలి

ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు: కేంద్రం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: రద్దయిన పాత కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలను ఇచ్చిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలను కేంద్రం ఖండించింది. ఈ వార్తలు తప్పని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ ఎలాంటి నిబంధనలు జారీ చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం శనివారం ‘ఎక్స్’లో పేర్కొంది.

ఖచ్చితమైన సమాచారం కోసం ఆర్బీఐ వెబ్‌సైట్ చూడాలని తెలిపింది. స్పామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, పాత, చెల్లని డబ్బును మార్చుకోవడానికి స్కామర్లు ‘ఫారమ్ ఛార్జీలు, డెలివరీ ఫీజులు’ అంటూ డబ్బు దోచుకోవడానికి ఈ విధమైన ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆర్బీఐ పేర్కొంది. ఏవైనా అనుమానాస్పద మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు ప్రజల దృష్టికి వస్తే పీఐబీ ఫాక్ట్‌చెక్ విభాగానికి పంపాలని విజ్ఞప్తి చేసింది.