19 April, 2026 | 1:28 AM

దేశాన్ని నటుల చేతిలో పెట్టలేం!

19-04-2026 12:06 AM
  1. కావాలంటే.. వారిని అభిమానించవచ్చు
  2. సినిమా చూసి జనం ఈలలు వేస్తే రాజకీయాలకు మద్దతిచ్చినట్లు కాదు
  3. టీవీకే అధినేత విజయ్‌ని ఉద్దేశించి నటుడు ప్రకాష్‌రాజ్ వ్యాఖ్యలు

చెన్నై, ఏప్రిల్ ౧౮: కావాలంటే నటులను ఎంతగానైనా అభిమానించవచ్చు గానీ, దేశా న్ని నటుల చేతిలో పెట్టలేమని సీనియర్ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యానించారు. తమకు నచ్చిన నటుడు వెండితెరపై కనిపిస్తే జనం ఈలలు వేసి తన అభిమానాన్ని చాటుకుంటానని, అంతమాత్రాన వారికి రాజకీయాల్లో మద్దతు ఇచ్చినట్లు కాదని వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో శనివారం  ఆయన పళని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలచిన సీపీపీ(ఎం) అభ్యర్థి పాండి తరఫున ఎన్నికల ప్రచా రంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీవీకే అధినేత విజయ్‌ని ఉద్దేశించి పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజల మధ్యకు వచ్చి, వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేయకుండా, నేరుగా ముఖ్యమంత్రి కావాల నుకోవడం సరికాదని హితవు పలికారు. సినిమాలో డాక్టర్‌గానో, ఇంజినీర్‌గానో లేదా ముఖ్యమంత్రిగానో నటించడం సులభమని, కానీ, నిజ జీవిత రాజకీయాల్లో జవాబుదారీతనం, నిబద్ధత అవసరమని అభిప్రాయప డ్డారు.

తమిళనాడు ప్రజలు ఎదుర్కొంటున్న అస్తిత్వ సమస్యలపై కానీ, భాషా ప్రాతిపదికన జరిగిన పోరాటాల్లో కానీ, ఏనాడూ విజయ్ గొంతు లేదని విమర్శించారు. ప్రజలు చూపే ప్రేమ విజయ్ నటనపైనే కానీ, అది రాజకీయాల వర్తించదని అభిప్రాయపడ్డారు. సిని మా చేసేందుకు ఎండలో క్యూలో నిలబడి, కటౌట్లు కట్టి అభిమానాన్ని చాటుకున్న ప్రజల ను రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని పేర్కొన్నారు.