13 July, 2026 | 1:05 AM

దైవ కృపతోనే అభివృద్ధి పథం

13-07-2026 12:04 AM

ఎంపీ డీకే అరుణ

మహబూబ్ నగర్ జూలై 12 (విజయ క్రాంతి) : దైవ కృపతోనే అభివృద్ధి పథం మరింత వేగంగా అడుగులు వేస్తుందని ఎంపీడీకే అరుణ అన్నారు. ఆదివారం నగరంలోని లక్ష్మీ నగర్ కాలనీ లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ ముఖద్వారంను ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. అనంతరం శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మన సంప్రదాయాలు, సంస్కృతి నీ కొనసాగిస్తూ ప్రతి పండగను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా చేసుకుంటుండటం శుభపరిణామన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో కలసి పని చేస్తున్నామని తెలిపారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్  కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, జ్యోతి , కాలనీ వాసులు, తదితరులు ఉన్నారు.