15 April, 2026 | 3:28 AM

సామాజిక న్యాయానికి అంబేద్కర్ చూపిన మార్గం ఆదర్శనీయం

15-04-2026 01:13 AM

ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి, ఏప్రిల్ 14 : భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల పరిరక్షణ కోసం చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు.

భారత రాజ్యాంగ రూపకర్తగా దేశ నిర్మాణంలో ఆయన చేసిన అపార సేవలను మంత్రి స్మరించుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి అమలు చేస్తోందని, సమాన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, విద్యా,ఉపాధి అవకాశాలు అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితోనే కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.

యువత అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో   సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.