calender_icon.png 12 February, 2026 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ‘పట్నం’ ఎన్నికలు

12-02-2026 12:00:00 AM

  1. 24 వార్డులలో  78.45 శాతం పోలింగ్ నమోదు

మొత్తం 20392 ఓట్లు పోలు కాగా, పురుషులు 9882, స్త్రీలు -10510 

అబ్దుల్లాపూర్‌మెట్, ఫిబ్రవరి 11: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బుధవారం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.  ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  24 వార్డులలో ఎన్నికల నిర్వహణ కొనసాగింది. గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అనే విధంగా ప్రచారాన్ని నిర్వహించారు.

మున్సిపాలిటీలో మొత్తం పోలైన ఓట్లు 20392, అందులో పురుషుల ఓట్లు 9882, మహిళల ఓట్లు 10510, మొత్తం  78.45 శాతం ఓట్లు పోల్ కాగా, మున్సిపల్ లో 24 వార్డులలో 48 పోలింగ్ బూతులలో పోలింగ్ నిర్వహించగా,  48 పోలింగ్ బాక్సులను ఎన్నికల అధికారులు పోలింగ్ ఏజెంట్ల ముందు సాయంత్రం 5 గంటల తర్వాత సిజ్ చేసి ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలకు తరలించడం జరిగింది. ఎన్నికల ఫలితాల కోసం ఈ నెల 13న కౌంటింగ్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

నా ఓటు ఎక్కడా..!

ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో  ఓ మహిళకు చేదు అనుభవం ఎదురు కావడంతో నా ఓటు ఎక్కడా అని అధికారులు నిలదీసింది. తన ఓటును ఎవ్వరు వేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.  వివరాలలోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, శేరిగూడలోని 15వ వార్డులో ఓటు వేసేందుకు వెళ్లిన క్యామ పారిజాతకు చేదు అనుభవం ఎదురైంది. ఓటేసి తమకు కావాల్సిన నాయకు డుని ఎన్నుకునేందుకు గ్రామంలోని పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి క్యూలో నిలబడగా... తీరా తన వంతు రాగానే ఓటు వేసేందుకు పేరు వివరాలు తెలువగా..

ఆ ఓటు అప్పటికే పోల్ అయినట్లు అధికారులు చెప్పడంతో సదరు మహి ళా ఓటరు ఒక్కసారిగా అవాక్కయింది. తాను ఓటు వేసేందుకు ఇప్పుడే వచ్చానని తెలుపగా మరోసారి పరిశీలించి ఓటు ఇప్పటికే వేశారని అధికారులు చేపడంతో ఓటు చేసేవారి వివరాలు, ఐడెంటి కార్డులు చూడకుండా ఎలా అనుమతిస్తారని అధికారులను ప్రశ్నించింది. అధికారులను నుంచి సరైనా సమాధానం రాకపోవడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వెనుదిరిగింది.