10 April, 2026 | 6:03 AM

పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలి

14-12-2025 12:50 AM
  1. బిల్లులు చెల్లించక మూసివేసే దిశగా హాస్టళ్ళు
  2. ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని లేఖ
  3. తెలంగాణ బీసీ జాక్ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి) : తొమ్మిది నెలలగా మెస్ బిల్లులు, మూడు సంవత్సరాల హాస్టల్ భవనాలు అద్దె బిల్లులు, ఒక సంవత్సరం కరెంటు బిల్లు ల బకాయిలు చెల్లించకపోవడంతో హాస్టళ్ళు నిర్వహణ భారంగా తయారైందని తెలంగాణ బీసీ జాక్ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు.  హాస్టల్ విద్యార్థులకు భోజనం పెట్టే పరిస్థితి లేదని, 8 రోజులలో చెల్లించకపోతే మూసివేస్తామని హాస్టల్ అధికారులు అంటున్నారన్నారు.

వెంటనే ఈ బకాయిలు చెల్లించడానికి బడ్జెట్ విడుదల చేయాలని  ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశా రు.  ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని బడ్జెట్ విడుదల చేయాలనీ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వం దృష్టికి ఈ క్రింది డిమాండ్లను తీసుకొని వెళ్తామన్నారు. కూరగాయలు, మాం సం, గుడ్ల బిల్లులు గత పప్పులు, నూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల బిల్లులు గత 5 నెలలుగా చెల్లించడం లేదన్నారు.

దీనితో హాస్టళ్లకు కూరగాయలు, పప్పులు, గుడ్లు తదితర వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు వ్యాపారస్తులు హాస్టల్ అధికారులు అప్పుల పాలయ్యారన్నారు. నిత్యావసర వస్తువులు సరఫరా నిలిపి వేస్తామని అంటున్నారని, దీని మూలంగా హాస్ట ల్లో మూసివేసి పరిస్థితి ఏర్పడిందన్నారు. దాదాపు రాష్ట్రంలోని మొత్తం బీసీ కాలేజీ హాస్టళ్ళు అద్దె భవనాల్లో ఉన్నాయన్నారు. 3 సంవత్సరాల నుండి అద్దె చెల్లించడం లేదని, వీపరీత జాప్యం మూలంగా అద్ది యజమానులు భవనాలు ఖాళీ చేయమని బ్యాంకు రుణాలు ఎలా కట్టాలని అంటూ ఒత్తిడి చేస్తున్నారన్నారు.

వెంటనే అద్దె భవనాల బిల్లులు పాస్ చేయాలని, కొందరు హాస్టల్ యాజమానుల అద్దె చెల్లించకపోతే ఖాళీ చేయమని బెదిరిస్తున్నారన్నారు. హాస్టళ్ళ కరెంట్ బిల్లులు గత రెండు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్నాయన్నారు. పరీక్ష సమయంలో హాస్టళ్ళుకు కరెంటు కట్ చేస్తే విద్యార్థులు ఎలా చదువుకుంటారని, ఇంజనీరింగ్ పరీక్షలు ఎలా రాస్తారన్నారు. దీని ప్రభావం విద్యార్థుల పరీక్ష ఫలితాలపై ఉంటుందన్నారు.

గత 4 సంవత్సరాల కాలేజీ పీజుల బకాయిలు 8వేల కోట్లు ఉన్నాయని,  విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారన్నా రు. వెం టనే చెల్లిందాలన్నారు. బకాయిలు ఇవ్వక పోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వారి చదు వులపై ప్రభావం పడుతుందని,  వెంటనే బీసీ కాలేజీ హాస్టళ్ళ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.