14-12-2025 12:50:34 AM
హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శనివారం 216వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరిగింది.
భారత వైమానిక దళంలోని వివిధ పీపుల్ బ్రాంచీలకు చెందిన ఫ్లైట్ క్యాడెట్ల శిక్షణ విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా పరేడ్ నిర్వహించారు.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పరేడ్ సమీక్ష అధికారిగా వ్యవహరించారు. మొత్తం 244 మంది క్యాడెట్లు పట్టభద్రులయ్యారు.
వీరిలో 215 మంది పురుషులు, 29 మంది మహిళలు ఉన్నారు. భారత నావికాదళం నుంచి 16 మంది అధికారులు, ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి 8 మంది
అధికారులు, విదేశాలకు చెందిన ఇద్దరు అధికారులకు ఫ్లయింగ్ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసినందుకు ‘వింగ్స్’ అవార్డులు అందజేశారు.