10 April, 2026 | 7:48 AM

మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలి

14-12-2025 12:48 AM
  1. బీసీలు సర్పంచ్ సీట్లను అత్యధికంగా కైవసo చేసుకోవాలి
  2. పార్టీ పరంగా ఇస్తామన్న పార్టీలు ఇప్పుడు ఎవరు నోరు మెదపడం లేదు
  3. గల్లీ నుండి ఢిల్లీ దాకా బీసీలను మోసగిస్తున్న కాంగ్రెస్
  4.   15న ఢిల్లీలో పార్లమెంట్‌ను ముట్టడిస్తాం
  5. బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్

ముషీరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): బీసీలను మోసం చేసిన రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే ప్రస్తు తం జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించి బీసీల రాజకీయ చైతన్యన్ని  చాటి చెప్పాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రం గౌడ్ బీసీలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం హైదరాబాదులోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ జేఏసీ ఆధ్వ ర్యంలో ఈనెల 15,16 వ తేదీలలో చేపట్ట బోయే పార్లమెంట్ ముట్టడి కరపత్రం బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షులు విక్రమ్ గౌడ్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణతో కలిసి  ఆవిష్కరించారు.

సందర్భం గా తాటి కొండ విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ చట్టబద్ధంగా 42% రిజర్వేష న్లు ఇవ్వలేమని, పార్టీపరంగా 60 శాతం ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ మొన్న గాంధీభవన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో గానీ, మక్తల్, కొత్తగూ డెం, హుస్నాబాద్ లలో జరిగిన బహిరంగ సభలో గానీ సీఎం రేవంత్ రెడ్డి గానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌లు ఆ మాటే మాట్లాడడం లేదన్నారు.

బీసీలను మోసగించడానికి 60 శాతం అంటూ డ్రామాలాడాలని ఆయన మండిపడ్డారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంలో 42% బీసీ రిజర్వేషన్ల గురించి ప్రధానితో చర్చించక పోవడం బీసీలను నయవంచనకు గురిచే యడం కాదా  అని ఆయన ప్రశ్నించారు.

కనీసం తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నీ కలిసిన సందర్భంలో బీసీ రిజర్వే షన్ల బిల్లుపై పార్లమెంటు స్తంభింపజేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, నడుస్తున్నం దున పార్లమెంట్లో కార్యాచరణ పై ఎందుకు చర్చించలేదు బీసీ సమాజానికి సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ లో ఆమోదించాలని ఈనెల 15వ తేదీన ఢిల్లీలో పార్లమెంటును ముట్టడించడానికి తెలంగాణ నుండి పార్టీల కతీతంగా వేలాది మంది ఢిల్లీకి తరలి రావా లని,16వ తేదీన ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షులు విక్రమ్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం యూత్ జనరల్ సెక్రెటరీ సతీష్, భాస్కర్ మేరు, బండిగారి రాజు, మాధవ్ మేరు, భాస్కర్ జాజుల, బీసీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.