calender_icon.png 11 May, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షన్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి

18-04-2025 12:58:01 AM

టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్

గజ్వేల్, ఏప్రిల్ 17 :  ఏకపక్షంగా తీసుకువస్తున్న కొత్త పెన్షన్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని  తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్   సిద్ధిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ డిమాండ్ చేశారు.

గజ్వేల్ జోన్ ఆధ్వర్యంలో జోన్ కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన జూపల్లి రాంరెడ్డి  అభినందన సభకు  ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ  కేంద్రం పార్లమెంట్ సభ్యుల పారితోషికాలను ఎటువంటి చర్చలు జరపకుండా పెంచారని, 35 నుంచి 40 ఏళ్ల పాటు ప్రజలను అనేక సేవలందించిన పెన్షనర్లకు మాత్రం పెన్షన్ రివిజన్స్ ఎగనామం పెట్టడానికి బిల్లును ఆమోదించడం అన్యాయమన్నారు.

ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించాలని, లేకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెన్షన్ పెంపుదల అనేది భారత రాజ్యాంగంలోని ‘ఆర్టికల్-14’లోని ఆదేశాలని, వాటిని ఇప్పుడు ఉల్లంఘించడం ఎంతమాత్రం సరికాదని,వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 

కార్యక్రమంలో మాజీ రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్రం, రాష్ట్ర కౌన్సిలర్ రాజులు,జిల్లా ఉపాధ్యక్షులు పాపిరెడ్డి, జిల్లా కార్యదర్శి మంజుల, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సైదులు, సుగుణాకర్, జోన్ పరిధిలోని మండలాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు నాగరాజు,విద్యాసాగర్, సత్తయ్య, పోచం, పర్వతం నర్సయ్య, రాములు, వెంకటయ్య, రాజ నర్సింహా,సీనియర్ నాయకులు  ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.