calender_icon.png 9 July, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులు వెన్ను విరిగేలా కొట్టిండ్రు!

08-08-2024 12:00:00 AM

“తెలంగాణ రాష్ట్రం వస్తే పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయని భావించాను. తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభం నుంచి తెలంగాణ సాధించే వరకు ఉద్యమంలో పాల్గొన్నను. ఉద్యమ సమయంలో పది కేసులు నాపై పెట్టారు. వెన్నుపూసపై పోలీసులు కొట్టిన దెబ్బలు ఇప్పటికి మానలేదు. ఏ పని చేద్దామన్న వెన్నునొప్పి బాధిస్తున్నది” అని కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన ధర్మగౌని రాజాగౌడ్ విజయక్రాంతితో తన అనుభవాలను పంచుకున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్‌లో లాయర్లు ర్యాలీ సమావేశం నిర్వహించారు. అప్పటికే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. తెలంగాణ వస్తే పిల్లల భవిష్యత్ బాగుంటుందని తెలు సుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. అప్ప టికి నా వయస్సు 26 సంవత్సరాలు. కరీంనగర్‌లో జరి గిన సభకు హాజరై.. కేసిఆర్ వచ్చినప్పుడు న్యాయవాది నరేందర్‌రెడ్డి ఇంట్లో కుర్చొని ముచ్చటించాము. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మన పిల్లల భవిష్యత్ బాగు పడతాయని చెప్పిండు.

వరంగల్‌లో నిర్వహించిన కేసీఆర్ సమావేశానికి కామారెడ్డి నుంచి సైకిళ్లపై వెళ్లాం. ఆ తర్వాత టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షునిగా పని చేశాను. అప్పడు ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ నుంచి గెలిచారు. చిన్నమల్లారెడ్డిలో 41 రోజులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించాం. కామారెడ్డిలో జరిగిన ప్రతి కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతం చేశాం. ఉద్యమం లో చురుకుగా పాల్గొన్నందుకు అప్పటి డిఎస్పీ సలీమోద్దీన్ నాపై పది కేసులు నమోదు చేసిండ్రు. పోలీసులు వీపుపై దెబ్బలు కొట్టినవి నేటికి నొప్పులు వస్తున్నాయి. పనిచేద్దాం అంటే చాత కావడం లేదు. మా కులవృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాను. కల్లు డిపో నుంచి రూ.8 వేలు జీతం వస్తుంది. ఇద్దరు కొడుకులు, ఒక కుమా ర్తె ఉంది.

కుమార్తె పెండ్లి చేశాను. పెద్దకుమారుని పెండ్లి చేశాం.. కానీ వారికి ఉండేందుకు ఇల్లు సరిపోవడం లేదు. ఉద్యమం అప్పుడు ఖర్చుపెట్టిన పైసలు ఉంటే కొత్తగా ఇల్లు నిర్మించుకునేటోడిని. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక కేసులు ఎత్తివేశారు కానీ మాకు ఎలాంటి సహాయం చేయలేదు. కామారెడ్డి నుంచి ఎమ్మెల్యే గంపగొవర్థన్‌ను గెలిపించాం. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉద్యమంలో పనిచేసిన వారందరిని పక్కన పెట్టిండు. పదవులను రాత్రికి రాత్రే మార్చి ఆయన అనుచరులకు ఇచ్చేసిండు. అప్పటి నుంచి హరీష్ రావుకు, కేటీఆర్‌కు చెప్పిన ప్రయోజనం లేకుండా పోయింది. మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చి తన భార్య లక్ష్మీని ఎంపీటీసీగా గ్రామస్తులు  గెలుపించిర్రు.

కాంగ్రెస్ ఎంపీటీసీ అనే ఉద్దేశ్యంతో గ్రామ పంచాయతీలో కూడా కూర్చోనియ్యలేదు. ఇప్పటికి పోలీసు దెబ్బలతో ఇబ్బందులు పడుతున్నాను. రైలు రోఖో, బస్సు రోఖో, జేఏసీ రీలే దీక్షలు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాను. పోలీసులు ఏ టైమ్‌లో  వచ్చి తీసుకెళ్తారో తెలియకుండా ఉండేది. అంత పోరాటం చేసినా తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదు. గాదె ఇన్నయ్యసార్ ఉద్యమంలో పాల్గొన్న వారిని గుర్తించి కనీసం సర్టిపికేట్ అయిన ఇచ్చిండు. దానిని చూసి మురిసిపోతున్నా కానీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులకు తీరని అన్యాయం చేశారు. కనీసం మా పిల్లలకు అయిన ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రజాపాలన కార్యాక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల కోసం ప్రత్యేకంగా దరఖాస్తులో పేర్కొనడమే కాకుండా కేసుల వివరాలను అందులో నమోదు చేసి ఇచ్చాం.

కుటుంబ నేపథ్యం

కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన ధర్మగౌని గంగారాజం గౌడ్, నర్సవ్వల పెద్దకుమారుడు ధర్మగౌని రాజాగౌడ్. కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాడు. చిన్నప్పుడే  తండ్రి చనిపోవడంతో తల్లి నర్సవ్వ కూలి పనిచేసి తన ఇద్దరు చెల్లెలను, తమ్ముడిని నన్ను సాదింది. తెలంగాణ ఉద్యమ సమయంలో పనికి డుమ్మాకొట్టి ఉద్యమంలోనే పూర్తిగా పనిచేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది కానీ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం ఉన్న రెండు ఎకరాల పోలంలో మొక్కజొన్న పంటవేసుకుని జీవిస్తున్నారు. కల్లుగీత కార్మికునిగా పనిచేస్తూ ఇద్దరు కుమారుల ను, భార్యను పోషించుకుంటున్నాను. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను అదుకుంటుందనే నమ్మకం ఉందని ఆశగా ఎదురుచూస్తున్నారు.  

 మొసర్ల శ్రీనివాస్‌రెడ్డి,

కామారెడ్డి, విజయక్రాంతి