24-09-2025 01:12:29 AM
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) జిల్లాలో సిరిగిరి రమేష్ తో చందుర్తిలో గల భూమిని ఎస్సి కార్పొరేషన్ లోన్ పై పెట్రోల్ బంక్ నిమిత్తం చిర్రం రవి. సిరిగిరి రమేష్ కు రిజిస్ట్రేషన్ చేసినాడు, కానీ పెట్రోల్ బంక్ ఇవ్వలేదు తిరిగి భూమిని రిజిస్ట్రేషన్ కూడా చెయ్యలేదు, ఈ భూమి నాదే అంటూ ఎవ్వరికైనా అమ్ముదామని ప్రయత్నాలు మొదలు పెట్టాడు ఇట్టి విష యం తెలుసుకున్న.
చిర్రం రవి తన భూమి తనకు దక్కాలంటే సిరిగిరి రమేష్ ను అంతం చెయ్యాలని నిర్ణయించుకొని ఎద్దండి వెంకటేష్, అలా వంశీ లకు సూపరి ఇచ్చి పథకం ప్రకారం తేదీ 19-09-2025 రోజున రాత్రి అందాజ 08:00 గంటల సమయంలో పెద్దూరు సబ్ స్టేషన్ సమీపంలో కారు ఆపి, కారులో నిద్రిస్తున్న సిరిగిరి రమేష్ ను,అలా వంశీ కదలకుండా గట్టిగా కాళ్లు పట్టుకొని ఉండగా,
చిర్రం రవి కారు వెనక సీట్లో కూర్చొని సిరిగిరి రమేష్ ను కదలకుండా గట్టిగా పట్టుకోగా, డ్రైవర్ సీట్ లో కూర్చున్న ఏద్దండి వెంకటేశు వారితో తెచ్చుకున్న కత్తితో సిరిగిరి రమేష్ గొంతులో, చాతిపై పలు మార్లు పొడిచి హత్య చేసినారు. తర్వాత సిరిగిరి రమేష్ చనిపోయడని నిర్ధారించుకొని ఎద్దండి వెంకటేష్ శవాన్ని కారులో తీసుకువచ్చి వేములవాడ లోని నంది కమాన్ సమీపంలో గల రమేష్ యొక్క నందీశ్వర టౌన్ షిప్ వెంచర్ లో కారు వదిలిపెట్టి పారిపోయారు.
పోలీసు వారు తమ గురించి వెతుకుతారనే భయంతో పారిపోతుండగా వేములవాడ లోని సాయి రక్షా దాబా సమీపంలో పోలీస్ వారు ఏద్దండి వెంకటేష్ .అలా వంశీలను కా రుతోయుక్తంగా పట్టుకొని వారి వద్ద నుండి ఒక ఇన్నోవా కారు ను ,ఒక మొబైల్ ఫోన్. పెద్దండి వెంకటేష్, రమేష్ ను చంపడానికి ఉపయోగించిన కత్తిని సీజ్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగినది. ప్రస్తుతం చిర్రం రవి పరారీ లో ఉన్నాడని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. శేషాద్రి రెడ్డి వెల్లడించారు.