24-09-2025 01:14:19 AM
యధావిధిగా కొనసాగించాలని ఉత్తర్వులు
కోరుట్ల:సెప్టెంబర్23(విజయక్రాంతి)జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని యామాపూర్ సహకారసంఘ పాలకవర్గం ను వారం రోజులక్రితం తోలగించి నట్లు జిల్లా సహకారసంఘ అదికారి మనోజ్ కుమార్ ఉత్తర్వులు జారిచేశారు.
ఈమేరకు సహకారసంఘ చైర్మన్ల పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని,మంగవారం సహకారసంఘ చైర్మన్ అంకతి రాజన్న పాలకవర్గం తరుపున హైకోర్టు న్యాయవాది అల్లూరి దివాకర్ రెడ్డితో పిటిషన్ దాఖలు చేయగా పాలకవర్గాన్ని యధావిధిగా కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లుతెలిపారు.