24-09-2025 01:12:16 AM
మేకిన్ ఇండియా
ప్రభుత్వ అడ్వర్‌టైజ్‌మెంట్ల్ల విధానమూ మారాలి!
స్వదేశీ, ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా.. అంటూ భారత ప్రభు త్వం ఇచ్చే ప్రకటనలు మనం వార్తాపత్రికల్లో తరచుగా చూస్తుంటాం. వార్తా పత్రికలు ఆ ప్రకటనలను ప్రచురిస్తున్నది ఎక్కువగా విదేశీ న్యూస్‌ప్రింట్‌పైనే అంటే ఆశ్చర్యపోవద్దు. అవు ను మన పత్రికలకు మన దేశంలోనే తయారయ్యే న్యూస్ ప్రింట్‌ను ఉపయోగించాల్సిన సమయం ఆసన్నమైంది. దేశ ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలుగా పత్రికలు ఇప్పటికీ పనిచేస్తున్నాయి.
పత్రికల ప్రింటింగ్ ప్రెస్సుల్లో ప్రతి రోజు ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా వార్తలు ప్రచురితమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ‘మేకిన్ ఇండియా’ సంకల్పంతో మన పరిశ్రమలకు కొత్త రూపునిచ్చే పనిని మొదలుపెట్టారు. అయితే ఒక రంగం మాత్రం ఇప్పటికీ వెనుకబడే వుంది. అది పత్రికలకు అత్యంత ఆవశ్యకమైన న్యూస్ ప్రింట్ మార్కెట్. మన దేశం లో పత్రికలకు ప్రతి ఏటా 1.2 మిలియన్ మెట్రి క్ టన్నుల న్యూస్ ప్రింట్ అవసరమవుతున్నది.
ఇందులో 60% మనం రష్యా, కెనడా, ఇండోనేషియా మొదలైన దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆత్మనిర్భర్ గురించి రాసే వార్తా పత్రికలు విదేశీ న్యూస్ ప్రింట్‌పై ఆధారపడక తప్పడం లేదు. దీనివల్ల మన విదేశీ మారకద్రవ్య నిల్వలు నిండుకోవడమేకాదు, స్థానిక మిల్లులు కూడా విలవిలాడు తున్నాయి. దీనిని ఆరికట్టాలంటే మన విధాన నిర్ణయాల్లో మార్పు రావాలి.
మన దేశంలో ఉత్పత్తి అయ్యే న్యూస్ ప్రింట్‌ను మాత్రమే ఉపయోగించే పత్రికలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అడ్వర్‌టై జింగ్ బడ్జెట్‌లో సింహభాగం కేటాయించాలి. ఈ ప్రతిపాదనను అనుసరిస్తే, మనం స్వయంసమృద్ధి దిశగా పయనించడమే కాదు, ఉద్యోగ కల్పన, డిమాండ్‌ను కూడా అందిపుచ్చుకున్నవాళ్లమవుతాం. ప్రధాని మోదీ దార్శనికతను దృష్టిలో ఉంచుకొని వార్తా పత్రిక పరిశీలకులు ఈ ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారు.
వివిధ పథకాల అమలుకు, ఎన్నికలకు, ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలకు ప్ర భుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటాయి. వాటిని మన దేశంలో ఉత్పత్తయ్యే న్యూస్‌ప్రింట్‌ను ఉపయోగించి ప్రజల్లోకి తీసికెళ్లగలిగితే అందరికీ ప్రయోజనకరంగా ఉం టుంది. ‘దేశీయ న్యూస్ ప్రింట్‌ను ఉపయోగించడం ద్వారా వార్తా పత్రికల రెవెన్యూ నిల కడగా ఉంటుంది.
మన మిల్లులకు మంచి ఆర్డ ర్లు లభిస్తాయి. న్యూస్ ప్రింట్ తయారీకి వెదు రు చెట్ల గుజ్జు అవసరం. అందుకు మన రైతులు పెద్దఎత్తున వెదురు వనాలను పెంచే అవకాశం లభిస్తుంది. నిజమైన ప్రోత్సాహకాలు అందించే సందర్భం ఏర్పడుతుంది.’ అని భారత న్యూస్ ప్రింట్ తయారీదారుల సంఘం (ఐఎన్‌ఎంఏ) సెక్రటరీ జనరల్ విజయ్‌కుమార్ చెప్పారు.
భారీగా న్యూస్ ప్రింట్ అవసరం
మనదేశంలో న్యూస్ ప్రింట్ అవసరం భా రీగానే వుంది. జాతీయ వార్తా పత్రికలు మొదలుకొని ప్రాంతీయ భాషా పత్రికల వరకు ప్రతి నెలా దాదాపు లక్ష మెట్రిక్ తన్నుల న్యూస్ ప్రింట్ అవసరమవుతున్నది. 2024లో ఇది మార్కెట్ విలువ ప్రకారం చూస్తే మొత్తంగా 995 మిలియన్ డాలర్లకు చేరింది. అంతకుముంది ఏడాదితో పోలిస్తే 1.9% ఎక్కువ. ఇందులో 2024 డిసెంబర్ నాటి లెక్కలను బట్టి మన దేశంలో జరిగిన ఉత్పత్తి 36,273 మెట్రిక్ టన్నులు మాత్రమే.
ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు.. ప్రతిఏటా లెక్కిస్తే ఇది 5.5% వరకు తగ్గుతూ వస్తున్నది. ఈ తగ్గుదల అంచనా ప్రతిఏటా 0.7 మిలియన్ మెట్రిక్ టన్నులుగా వుంటున్నది. దానితో దిగుమతులు పెంచుకునే పరిస్థితి ఉత్పన్నమవు తున్నది. 2024 సంవత్సరంలో మన దేశం దిగుమతి చేసుకున్న న్యూస్ ప్రింట్ 6,57,000 మెట్రిక్ టన్నులు. దీని విలువ దాదావుగా 380 మిలియన్ డాలర్లు. ఇందు లో ఒక్క రష్యా నుంచి దిగుమతి చేసుకున్న న్యూస్ ప్రింట్ విలువ 139 మిలియన్ డాలర్లు ఉంటుంది.
ధర నిలకడగా ఉండదు..
న్యూస్ ప్రింట్ ధర విదేశీ మార్కెట్‌లో ఎప్పుడూ ఒకేలా ఉండదు. దానితో దిగుమతి వ్యయం మారుతూ ఉంటుంది. స్వదేశీ న్యూస్ ప్రింట్ ఒక మెట్రిక్ టన్ను 620 డాలర్ల వరకు ఉంటుంది. ఇంధనం, ముడి సరుకు వంటి ఖర్చులతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. రష్యా మిల్లుల నుంచి దిగుమతి చేసుకునే 42 జీఎస్‌ఎం వంటి స్టాండర్డ్ గ్రేడ్ న్యూస్‌ప్రింట్ రవాణా, సుంకాలతో కలుపుకొని మెట్రిక్ టన్ను 580 డాలర్లకు లభ్యమవుతున్నది.
మలేషియా నుంచి మనం దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్ పరిమాణం తక్కువే అయినా దాదావు 590 డాలర్లకు మెట్రిక్ టన్ను లభిస్తోంది. ‘ఈ వ్యత్యాసం మెట్రిక్ టన్నుకు 40 డాలర్లకు కనిపించినా, ఇది చిన్నదేమీ కాదు. పెద్ద పబ్లిషర్లకు ఇది కొట్లాది రూపాయల భా రం అవుతుంది’ అని మాడిసన్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ సింగ్ తెలిపారు.
ప్రభుత్వ అడ్వర్‌టైజ్‌మెంట్ల్లతోనే ఈ వ్య త్యాసం తొలగిపోవాలి. అడ్వర్‌టైజ్‌మెంట్లు ఒక వారధిగా నిలవాలి. ౨౦౨౪ సంవత్సరం లో ప్రింట్ మీడియా అడ్వర్‌టైజ్‌మెంట్ల్ల కోసం ప్రభుత్వం రికార్డు స్థాయిలో ౨౦వేల కోట్లు (౨.౪ బిలియన్ డాలర్లు) వెచ్చించింది. కోవిడ్ కంటే ముందు కేటాయించిన దానికంటే ఇది చాలా అధికం. కేంద్రప్రభుత్వం ఇందులో ౧,౦౮౪ కోట్ల రూపాయలను ౨౦౨౪-౨౫ బడ్జెట్‌లో కేటాయించింది.
వీటిలో ఎక్కువభాగం వార్తా పత్రికలకే అందించారు. రాష్ట్రాలేమీ వెనుకబడలేదు. ౨౦౨౨-౨౫ మధ్య మూడేళ్లలో అడ్వర్‌టైజ్‌మెంట్ల్లకు ఒడిషా వెచ్చించిన మొత్తం ౩౮౦ కోట్లు. ఇందులో ప్రింట్ మీడియాకు ౩౪౪ కోట్లు ఇచ్చారు. ౨౦౨౩-౨౪ సం వత్సరంలో ఢిల్లీ, పశ్చిమబెంగాల్ వందలాది కోట్లు వెచ్చించాయి. అంతకుముందు కంటే ఈ రెండు రాష్ట్రాలు అడ్వర్‌టైజ్‌మెంట్ల్లకు ఎక్కువనే కేటాయించాయి. ౨౦౧౯-౨౪ మధ్య కేం ద్ర ప్రభుత్వం ౯౬౭ కోట్లు ప్రింట్ మీడియాకు ఖర్చు చేసింది.
అవసరం మేరకు మనదేశంలోనే న్యూస్ ప్రింట్ తయారీకి పూనుకుంటే, ౩౦-౪౦ శా తం దిగుమతులను నివారించవచ్చు. ప్రతియే టా రెండు లక్షల మెట్రిక్ టన్నుల న్యూస్ ప్రిం ట్ మన మిల్లుల్లోనే ఉత్పత్తి చేయడానికి నడుం కట్టవచ్చు. ఎమామీ పేపర్, జేకే పేపర్ వంటి మిల్లులు మనదేశంలో ౪౦ న్యూస్ ప్రింట్‌ను తయారుచేస్తున్నాయి. ఇ లాంటి మిల్లులను ప్రోత్సాహిస్తే ప్రతినెలా ౨౫ మిలియన్ డాలర్ల దిగుమతి భారాన్ని తగ్గించుకోవచ్చు.
తద్వారా ఉద్యోగ కల్పనే మాత్రమే కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. న్యూస్ ప్రింట్ రంగం ద్వారా ౧౦లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. మొత్తంగా కాగితం పరిశ్రమ ప్రత్యక్షంగా ౫ లక్షల మందికి, పరోక్షంగా ౧౫ లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. జీడీపీలో ఇది ౧.౬ శాతం అవుతుంది. వెదురుగుజ్జు తయా రీ, మిల్లింగ్‌లో ౫ లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని ఐఎన్‌ఎంఏ అంచనా.
మనదేశంలో ౨౫ మిలియన్ హెక్టార్లలో ఇప్పుడు వెదురు పెంపకం జరుగుతున్నా దాన్ని సక్రమంగా వినియోగించుకోవడం లేదు. ప్రభుత్వ ప్రోత్సహకాలు తక్కువేంకాదు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర బాటలో తెలంగాణ రాష్ట్రం వెదు రు పెంపకంలో మహిళల స్వయం సహాయక బృందాలను ప్రొత్సహిస్తున్నది.
వారు ఆదా యం పెంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతున్నది. ‘వెదురు పెంపకందారులకు సరైన మార్కెటింగ్ విధానం అవసరం. మనదేశంలోని న్యూస్ ప్రింట్ డిమాండ్‌కు తగిన విధంగా మార్కెట్ చేయగలిగితే, వెదురు ‘గ్రీన్ గోల్డ్’గా మారుతుందనడంలో సందేహం లే దు’ అని నీతి ఆయోగ్‌కు చావి ఝా చెబుతున్నారు.
సవాళ్లను ఎదుర్కోవడమెలా..?
ఇందులో అనేక సవాళ్లు కూడా ముందున్నాయి.. ఇది వాస్తవం. ౩౯ జీఎస్‌ఎం క్వాలిటీతో పబ్లిషర్ల కోసం దేశంలోని న్యూస్ ప్రింట్ మిల్లులు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఏ మేరకు ఉత్పత్తి చేయాలనేది మరో సమస్య. ఎందుకంటే దిగుమతి చేసుకొనే న్యూస్ ప్రింట్‌తో పోటీ పడాల్సివస్తున్నది. ౧ మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయగలిగినా ౭౦ శాతం కంటే తక్కువగాను అమ్మ కాలు జరుగుతున్నాయి.
౨౦౨౪ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఒక మెట్రిక్ టన్ను న్యూస్ ప్రింట్ ధర ౪౯,౫౦౦గా ఉన్నదని డీవీ కార్పొరేషన్ వంటి పబ్లిషర్లు పేర్కొ న్నాయి. ఇదే కాలంలో రెవెన్యూలో ౧౦ శాతం తగ్గుదల కనిపించింది. ౨౦౨౨లో న్యూస్ ప్రిం ట్‌పై దిగుమతి సుంకం ౫ శాతం పెరగడంతో కొందరు దృష్టి దేశవాళీ న్యూస్ ప్రింట్‌వైపు మళ్లింది. ౨౦౧౯లో తెచ్చిన విధానం వల్ల దేశవాళీ సప్లుయర్లు ప్రభుత్వ టెండర్లకు మొగ్గు చూపడంతో టెక్స్‌టైల్ మిల్లులకు ఊతం లభించింది.
ప్రింట్ మీడియాకు ఈ విధానం పనిచేస్తుంది. ‘దేశీయంగా ఉత్పత్తి అయిన న్యూస్ ప్రింట్‌ను ౭౦ శాతం వరకు వాడాల్సిందేనని, అప్పుడే ప్రభుత్వ అడ్వర్‌టైజ్‌మెంట్ల్లకు అర్హత లభిస్తుందని తప్పనిసరి చేస్తే మార్పు వస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ వైపుకు అడుగులు పడతాయి’ అని ఐఎన్‌ఎస్ అధ్యక్షుడు మొహిత్ జైన్ సూచిస్తున్నారు.
తప్పనిసరి చేయాలి..
2025-26 బడ్జెట్ రాబోతున్నది.. 2024లో ప్రింట్ మీడియా సర్క్యూలేషన్ తగ్గింది 1.2 శాతం మాత్రమే. 2025 అడ్వర్‌టైజ్‌మెంట్ల్లు 1.7 శాతం పెరిగాయి. ప్రభుత్వాలు అడ్వర్‌టైజ్‌మెంట్ల్లకు పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నామంటే సరిపోదు. దేశంలోనే న్యూస్ ప్రింట్ పెద్దఎత్తున ఉత్పత్తి అయ్యేలా, దాన్ని తప్పనిసరిగా ఉపయోగించడంలో ఏ ప్రతిపాదన అయినా స్వీకరించాలి. అప్పుడే ప్రభుత్వాలకు అండగా ఉండే పత్రికలు స్వతంత్రంగా మనగలుగుతాయి.
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి