calender_icon.png 9 January, 2026 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కత్తిమీద సమూలంటిది సర్పంచ్ పదవి

05-01-2026 12:20:22 AM

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య 

సిద్దిపేట, జనవరి 4 (విజయక్రాంతి): కత్తిమీద సమూలంటిది సర్పంచ్ పదవి అని, అరకొర నిధులతో గ్రామాలను ఆగం చేయకుండా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య సూచించారు. గ్రామాలను ఆదర్శంగా అభివృద్ధి చేయాలంటే మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలోనీ ఎస్సీ, ఎస్టీ సర్పంచు, ఉప సర్పంచుల సన్మాన కార్యక్రమంలో వెంకటయ్య పాల్గొని మాట్లాడారు. గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో ప్రధాన పాత్ర పోషించాలని చెప్పారు. పదవి పొందిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని, పార్టీలకు అతీతంగా నిధులు సేకరించి గ్రామంలోని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తూ నిరంతరం పాలకులుగా గుర్తింపు  పొందాలని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలందించి వారి మన్ననలు పొందాలన్నారు. గ్రామంలో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులు పార్టీలకు అతీతంగా సేవలందించాలని, గ్రామంలో ఐక్యత చేయాలన్నారు. తల్లిదండ్రులను గౌరవించని వారు గ్రామాలను అభివృద్ధి చేయని సర్పంచులు మానవజాతికి అవమానకరమైన వారని తెలిపారు. ఉత్తమ సర్పంచులుగా అవార్డులు సాధించాలని కోరారు. కుల, మతలకు అతీతంగా సేవలందించాలని కోరారు. మీ పిల్లలను ఉన్నత చదువు చదివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. శంకర్, ప్రతినిధులు మెట్ల శంకర్, ఎగొండ స్వామి, శంకర్, తిరుపతి, ఎంపిటిసిల ఫోరమ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దేవి రవీందర్, తిమ్మాపూర్ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ పాల్గొన్నారు.