05-01-2026 12:18:49 AM
ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేదెప్పుడు
పెండింగ్ పనులను పూర్తి చేయాలి
కేసీఆర్ అడిగితే సీఎం రేవంత్ రెడ్డి నిధులిస్తారు
డీసీసీ అధ్యక్షురాలు అంక్షా రెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి
ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ ని ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు
కేసీఆర్‌కు అస్వస్థత
గజ్వేల్, జనవరి 4: అసెంబ్లీలో ప్రజా సమస్యలపై యుద్ధం చేస్తామన్న మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీలో సంతకం పెట్టి వెళ్లిపోయారని, కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని డిసిసి అధ్యక్షురాలు అంక్షా రెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిలు మండిపడ్డారు. డిసిసి అధ్యక్షురాలు అంక్షా రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం మర్కుక్ మం డలం ఎర్రవల్లిలోని కెసిఆర్ ఫామ్ హౌస్‌ను ముట్టడించారు. అసెంబ్లీలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల పునరావాసులతోపాటు గజ్వేల్ ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కారానికి కృషి చేయాలని ఫామ్ హౌస్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సీఎంగా కేసీఆర్ ఉండి కూడా గజ్వేల్ ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. అందరి సమస్యలు పరిష్కరించి ప్రాజెక్టుల పునరావాసులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్యాకేజీలు ఇస్తామని, పనులు మధ్యలో నిలిపివేయడంతోపాటు ప్యాకేజీలు కూడా పూర్తిగా ఇవ్వలేదని ఆరోపించారు. గజ్వేల్ రింగ్ రోడ్డు ఇంకా అసంపూర్తిగానే ఉందని, పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ సమస్య పరిష్కరించలేదని పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంతో పాటు నియో జకవర్గ సమస్యల పరిష్కారానికి కెసిఆర్ అడిగితే నిధులు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు.
కెసిఆర్ అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసిఆర్ తమకు వివరణ ఇవ్వాలని కోరగా, కెసిఆర్ పిఏ నాగేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లోని కెసిఆర్‌కు సమాచారం ఇవ్వగా, ఆయన అస్వ స్థతతో బాధపడుతున్నారని, రెండు మూడు వారాల్లో కలవడానికి సమాచారం ఇస్తామని నర్సారెడ్డి, అంక్షా రెడ్దిలకు ఏ నాగేందర్ రెడ్డి ద్వారా వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు ఫామ్ హౌస్ వద్ద నుండి వెళ్లిపోయారు. నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ చైర్మ న్లు, వైస్ చైర్మన్లు, పలు గ్రామాల సర్పంచ్లు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.