17 April, 2026 | 11:52 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రిజర్వేషన్ల అమలు అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే

27-06-2025 12:00 AM
  1. స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
  2. బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాం తి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30ను గడువుగా విధించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే రాష్ర్ట ప్రభుత్వం వెంటనే ఈ తీర్పు ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.

బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో గురువారం మీడియా మాట్లాడుతూ.. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మద్ద తు ప్రకటించారని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లు ఇచ్చే అధికారం, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే బాధ్యత రాష్ర్ట ప్రభుత్వానిదేనన్నా రు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243డీ ప్రకారం రాష్ర్ట ప్రభుత్వానికి అధికారం ఉందని, రాష్ర్ట ప్రభుత్వం ఈ అధికారాన్ని వినియోగించుకొని బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాం డ్ చేశారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకోవాలని కోరారు. కొందరు 50 శాతం సీలింగ్ పేరుతో సుప్రీంకోర్టు లేదా హైకోర్టు స్టే ఇస్తుందేమో అనే వాదనలు చేస్తున్నారని, ఇది పూర్తి గా తప్పుదారి పట్టించే గోబెల్స్ ప్రచారం మా త్రమేనని ఖండించారు. రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ జనాభా లెక్కలు తేల్చిందని, ఆ లెక్కల ప్రకారం రాష్ర్టంలో బీసీ లు 42 శాతం కన్నా ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న అభిప్రాయంతో అసెంబ్లీలో చట్టం కూడా చేశారని, దీంతో న్యాయపరంగా ఎలాం టి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలన్నారు. అన్ని బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయని పేర్కొన్నారు.