18 April, 2026 | 1:35 AM

డిప్యూటీ మేయర్‌ను కలిసిన ప్రిన్సిపాల్

26-06-2025 11:54 PM

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 26 (విజయక్రాంతి): లాలాపేట్ గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ నూతన ప్రిన్సిపాల్ శ్రీవాణి గురువారం డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి, టిటియుసి రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్‌రెడ్డిలను డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్.. శ్రీవాణికి శుభాకాంక్షలు చెప్పారు. గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి పనుల్లో మరింత పురోగతి సాధించేందుకు కృషి చేయాలని, విద్యారంగంలో వినూత్న మార్పులు తీసుకురావడంలో సమర్థత చూపాలని ఆకాంక్షించారు.