17 April, 2026 | 10:08 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

27-06-2025 12:00 AM

సెయింట్ మేరీస్ సెంటెనరీ కాలేజీ ఆధ్వర్యంలో అవగాహన

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 26 (విజయక్రాంతి): సెయింట్ మేరీస్ సెంటెనరీ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఎస్‌ఎంసీసీఓఎం) గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. డ్రగ్స్ వినియోగంతో కలిగే ప్రమాదాలు, మాదకద్రవ్య రహిత సమాజం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కళాశాల ర్యాలీ, వ్యాస రచన, సమూహ చర్చలను నిర్వహించారు. ర్యాలీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ మీదుగా సాగింది. కాలేజీ డైరెక్టర్, ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ ఆంథోనీ వినయ్ మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు ప్రతి ఒక్కరు దూరం గా ఉండాలని సూచించారు. ఆరోగ్యకరమైన, మరింత బాధ్యతాయుతమైన భవిష్యత్తు కోసం సమాజాన్ని ప్రేరేపించాలన్నారు.