17 April, 2026 | 10:33 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

‘పంచశీల’ ఆచరణ భారత్‌కు కీర్తి

16-05-2025 12:00 AM

కాల్పుల విరమణ సరే గానీ ఈ ‘ఆపరేషన్ సిందూర్’  ఏం తేల్చిం. పెద్దన్న ట్రంప్ చెప్పాడు కాబట్టి అది జరిగందనుకోవాలి. ఆ వెంటనే భారత విదేశాంగ శాఖ కూ డా అధికారికంగా కాల్పుల విరమణ ప్రకటించింది. అంతే.. ‘ఆపరేషన్ సిందూర్’ ఆగిపోయింది. వెనువెంటనే పాకిస్థాన్ - ఇండియా నడుమ కాల్పుల విరమణ అంగీకారం జరిగింది. క్రమంగా రెండు దేశాల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి.

రెండు అణ్వస్త్ర దేశాల నడుమ యుద్ధాన్ని ప్రపంచం ఒప్పుకోదు. వాణిజ్యం ఆపేస్తామని ప్రపంచ పెద్దన్న హెచ్చరించారని, అందుకే కాల్పులు ఆగిపోయానని చెప్తున్నది. ఇలా అమెరికా ఒక రకంగా మధ్యవర్తిత్వం చేసి నట్లే. తప్పదు. ఎందుకు తప్పదంటే? పాకిస్థాన్‌కు ఓసారి బలమైన శాస్తి అవసరమే. కానీ, అమెరికా వంటి దేశం చెప్పాక అయిష్టంగానైనా మ నం అంగీకరించక తప్పదు.

లేకపోతే యూరోపియన్ యూనియన్, అమెరికా మిత్రదేశాలు మనల్ని ఏకాకిని చేసే ప్రమాదం ఉంది. కాల్పుల విమరణకు మనకంటే పాకిస్థాన్ ముం దుగా ఒప్పుకోవాలి. ఉద్రిక్తలు ఆపిందంటే పాక్ ముందు అమెరికాకు కృతజ్ఞతలు తెలపాలి. కాల్పులు కొనసాగితే బాగా నష్టపోయేది పాకిస్థానే కాబట్టి. మరి అప్పటివరకు రెండు దేశాల మధ్య జరిగిన క్షిపణులు, డ్రోన్ల దాడిని మనం ఎలా చూడాలి.

పాకిస్థాన్‌కు అయితే ఒకరకంగా భయం వచ్చింది. భారత్ అమ్ములపొదిలో ఎన్నో బలమైన ఆయుధాలున్నాయి. ఇకపై భారత్‌తో పెట్టుకుంటే పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయనే సంకేతాలు పాక్‌కు వెళ్లాయి. ఇకపై ఉగ్రదాడి జరిగితే భారత్ యుద్ధం చేస్తుందని పాక్ నిర్ధారణకు వచ్చింది. నాలుగు రోజుల భారత్ దాడులకే పా క్ అంతర్జాతీయ అర్థిక సంస్థలను బి చ్చమడిగింది.

అయితే.. పాక్‌కు తుర్కి యే, అజర్‌బైజాన్ వంటి దేశాలు ఆయుధ సంపత్తినివ్వడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఆ రెండు దేశాలకు ఇకపై భారత్‌కు మద్దతు ఇచ్చే దేశాల నుంచి సెగ తప్పదు. చైనా కొన్ని ఆయుధాలు పాక్‌కు ఇచ్చినప్పటికీ, అవి తుస్.. మనడం పాక్‌కు కొరుకుడుపడని అంశం. పాక్‌కు బెలూచిస్తాన్, టీటీపీ తిరుగబాటుదారుల సెగ కూడా బాగా తగిలింది.

పాకిస్థాన్ నుంచి డ్రోన్లే కాదు, మిసైళ్లు కాదు.. చివరకు పురుగు వచ్చినా సరే.. భారత సైన్య అమ్ములపొది ముందు దిగదుడుపే. ఇదే ఉత్సాహాన్ని భారత సైన్యం ఇకపై కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. చివరగా భారత్ దేశం పంచశీల బోధించిన దే శం. శాంతి సమతలు విరాజిల్లే దేశం. సమానత్వాన్ని ప్రబోధించిన దేశం. ఇతర రాజ్యాల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోని దేశం.

దురాక్రమణలకు పాల్పడని దేశం. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించే దేశం. అందుకే భారత్ అంత ర్జాతీయ సంబంధాలు నెరపడంలో ఆచీ తూచి అడుగు వేస్తుంది. ఇప్పటికే చైనా, మయన్మార్ దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు భారత్ పంచశీల ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. యుద్ధం, దాడులు ఎలాంటివి వచ్చి నా పంచశీల సూత్రాలను ముందు పరిగణలోకి తీసుకుంటాం. ‘పంచశీల’ ఆచరణ భారత్‌కు ఘన కీర్తి తెచ్చిపెట్టిందనడంలో సందేహం లేదు.

- ఉమాశేషారావు వైద్య

అధ్యాపకుడు, కామారెడ్డి

94404 08080