11 April, 2026 | 2:19 AM

జూన్ 2 నాటికి పీఆర్సీని ప్రకటించాలి

11-04-2026 12:28 AM
  1. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలి 
  2. సీపీఎస్ రద్దుచేసి ఓపీసీ విధానం అమలు చేయాలి 
  3. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాం తి) : ఉద్యోగులకు జూన్ 2 నాటికి పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏ సీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఓడనాల రాజశేఖర్ డిమాండ్‌చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. శుక్రవారం తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పరిష్కార మార్గాలపై జేఏసీ భాగస్వామ్య సంఘాల ప్రతినిధులందరూ సుదీర్ఘంగా చర్చించారు. అనేక డిమాండ్లలో సర్కారు సత్వరం పరిష్కరించాల్సిన పలు ప్ర ధాన డిమాండ్లను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ రాజశేఖర్ మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యో గుల పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలనని కోరారు.

రిటైర్డ్ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ జారీచేసి తక్షణమే అమలుచేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఉద్యోగులు, వారి కుటుంబాల పరి స్థితి దయనీయంగా మారుతుందన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకమైన ఉద్యోగులకు వెంటనే ఓపీఎస్ విధానం అమలు చేయాలన్నారు.

జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణ..

పెండింగ్ బిల్లులతోపాటు పెండింగ్ డీఏలను విడుదలచేయాలని, గతంలో ప్రభు త్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 ఏండ్లు నిం డిన వీఆర్‌ఏల వారసుల ఉద్యోగ నియామక సమస్యను సత్వరం పరిష్కరించాలని లచ్చిరెడ్డి, రాజశేఖర్ కోరారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. త్వర లో జనాభా లెక్కల కార్యక్రమం ఉన్నందున ఉద్యోగ, ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు చేపట్టాలన్నారు.

ఉద్యోగుల ప్రధాన డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా జేఏసీ ప్రత్య క్ష కార్యాచరణ ప్రకటించినట్టు చెప్పారు. ఈ నెల 17న మండల, డివిజన్ కేంద్రాల్లో భోజ న విరామ సమయంలో తహసీల్దార్లకు, మే 5న కలెక్టర్లుకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు.

సమావేశంలో తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే రామకృష్ణ, తహసీల్దార్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ రాములు, జనరల్ సెక్రటరీ రమే శ్ పాక, సెక్రటరీ జనరల్ పూల్‌సింగ్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్య క్షుడు బాణాల రాంరెడ్డి, టీజీఆర్‌ఎస్‌ఏ ఉపాధ్యక్షుడు భిక్షం, రాష్ట్ర కోశాధికారి మల్లేశ్, మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ, తెలంగాణ ప్రాంత ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కే హన్మంత్‌రావు, కమర్షియల్ టాక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీ కృపాకర్, అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కే రాములు పాల్గొన్నారు.