ఆర్టీసీ ఉద్యోగులకు 2.1% డీఏ పెంపు
హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగు లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ క్యాలెండర్ సంవత్సరం నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ పెంచుతున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రకటించారు. ఆర్టీసీలో పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై పలు రీజియన్‌లో ఆర్‌ఎంలతో మంత్రి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంతకుముందు 50.7 శాతం డీఏ ఉండగా, ఇపుడు దాన్ని 52.8 శాతానికి పెంచినట్టు పేర్కొన్నారు.
పెరిగిన డీఏ జనవరి 1, 2026 నుంచి అమలుకానున్నట్టు స్పష్టంచేశారు. డీఏలో పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ ప్రకటించడం పట్ల మంత్రికి అధికారులు అభినందనలు తెలియజేశారు. గడిచిన మూడు నెలలకుగానూ ఒక్కో నెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా ప్రభుత్వం చెల్లించనున్నట్టు ప్రకటించారు. పెరిగిన డీఏ ద్వారా ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందన్నారు.
ప్రభుత్వం చివరగా జూలై 2025లో 2.1 శాతం పెంచిందని, ప్రస్తుతం పెరిగిన 2.1 శాతం డీఏతో 52.8 శాతానికి చేరిందన్నారు. జనవరి నుంచి పెండింగ్ డీఏలు భవిష్యత్‌లో వచ్చే 3 నెలలకు ఒక్కో నెలలో విడుదల చేయనున్న ట్టు వెల్లడించారు. ప్రజాప్రభుత్వంలో మొద టి నుంచి ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షే మం, ప్రయాణికుల సౌల్యభం కేంద్రంగా పనిచేస్తుందన్నారు.
తెలంగాణలో లైఫ్‌లైన్‌గా ఉన్న ఆర్టీసీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లలా కృషిచేయాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆర్టీసీ సిబ్బంది ఎదురుచూస్తున్న డీఏను ప్రకటించడం సంతోష మని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అన్నారు. కార్మికుల సంక్షేమమే మా ప్రధాన ధ్యేయమని చెప్పారు. కార్యక్రమంలో ఈడీలు సీహెచ్ వెంకన్న, ఖుస్రోషా ఖాన్, రాజశేఖర్, సాల్మ న్, ఎఫ్‌ఏ విజయపుష్ప, సీఅండ్ ఎం శ్రీధర్, సీపీఎం ఉషాదేవి పాల్గొన్నారు.




