30 April, 2026 | 2:03 AM

ప్రతి కాలనీని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం

30-04-2026 12:57 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, సమస్యత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం 31వ, 51వ డివిజన్ లలో 1.60 కోట్ల రూపాయల వ్యయంతో సిసి రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్రలో గుర్తించిన సమస్యలను ప్రధాన్యత క్రమంలో తీసుకొని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో స్థానికుల నుండి వచ్చిన వినతులను, ఆధారం చేసుకుని అభివృద్ధి పనులను అమలు చేస్తున్నామని అన్నారు.

ప్రారంభించిన ప్రతి పనిని నిర్ణయిత కడుపులో పూర్తి చేయడానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని, పనుల నాణ్యత పై రాజీ ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని లక్ష్మారెడ్డి, 31వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు, 51వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ తౌట్ రెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, కాంగ్రెస్ శ్రేణులు మామిడాల రంజిత్, మామిడాల సంపత్, సూరజ్ నాయక్, మధు, సలీం, నరేష్, అధికారులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.