4 July, 2026 | 2:24 AM

గ్రామీణ ప్రజలకు కనీస మౌలిక వసతుల కల్పనే ప్రధాన ధ్యేయం

04-07-2026 01:32 AM

అభివృద్ధికి కట్టుబడి నిరంతరం ప్రజల కోసమే నిర్విరామ కృషి.

కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.

రూ.2.93కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం.

పాల్వంచ, జులై 3 (విజయక్రాంతి): గ్రామీణ ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచ మండల పరిధిలోని వివిధ పథకాలు, గ్రాంట్ల రూపంలో విడుదలైన రూ. 2.93 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని సిసి రోడ్లు, డ్రైన్లు, బిటి రెన్యూవల్స్, ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో గ్రామీణ ప్రధాన రహదార్ల నిర్మాణం ఇప్పటికే తుదిదశకు చేరుకున్నాయని, అంతర్గత రోడ్ల, డ్రైన్లు, బిటి రెన్యూవల్స్  పనులు సైతం ముమ్మరంగా జరుగుతున్నాయని వివరించారు.

ప్రజల అవసరాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, ప్రాధాన్యతా క్రమంలోనే పనులను చేపడుతూ నిధులను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కేటీపీఎస్ విస్తరణ, పాల్వంచ స్థలాల క్రమబద్దీక రణ, విమానాశ్రయం, ఓఆర్ రోడ్లు, పరిశ్రమను అభివృద్ధి తదితర వాటిపై ప్రేత్యేక ద్రుష్టి సారించడం జరిగిందన్నారు.   సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయ ర్ మూడ్ గణేష్, సిపిఐ నాయకులు ముత్యా ల విశ్వనాధం, నయుం ఖురేషి, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, కాంగ్రెస్ నాయకులు ఎర్రంశెట్టి ముత్తయ్య, కొండా వెంకన్న తహసిల్దార్ దారా ప్రసాద్, పంచాయతీ రాజ్ డి ఈ రాజశేఖర, సీపీఐ నాయకులు కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.