4 July, 2026 | 2:24 AM

ఆయిల్ పామ్ సాగుతో సంపద సృష్టించుకోవచ్చు

04-07-2026 01:28 AM

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 

-తాడ్వాయి, జూలై, 3 (విజయక్రాంతి): ఆయిల్ ఫామ్ మొక్కల సాగు తో సంపద సృష్టించుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో ఆయన శుక్రవారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసుకొని మంచి ఆదాయం పొందవచ్చన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 2022-23 సంవత్సరంలో ఆయిల్ ఫామ్ సాగు ప్రారంభమైందని తెలిపారు. మొత్తం జిల్లాలో 885 మంది రైతులు 2533 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 1300 ఎకరాల లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటికే 1000 ఎకరాలకు రైతులను గుర్తించినట్లు వెల్లడించారు.

ఇప్పటి వరకు జిల్లాలో 48 రైతులకు చెందిన 180 రకాలల్లో కోత పూర్తయిందని,76 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగిందన్నారు. గ్రామానికి చెందిన రైతు కాటిపల్లి రామ్మోహన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్  సందర్శించారు. ఆయన 8 ఎకరాల్లో చేపట్టిన ఆయిల్ పామ్ మొక్కల పామ్ ను పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సాధ్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఎకరాకు 50 మొక్కలు అవసరమావుతాయని ఒక్కో మొక్కకు రూ. 20 అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయాధికారి జ్యోతి, గ్రామ ఉప సర్పంచ్ గంగయ్య, ఎంపిడిఓ భరత్ కుమార్, ఎంపిఓ  సవితరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.