31 May, 2026 | 7:14 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

ఫూలే ఆశయం కోసం ప్రధాని పాటుపడాలి

13-04-2026 02:30 AM

బీసీ మహిళ సబ్ కోటపై అన్ని పార్టీలు తమ వైఖరి ప్రకటించాలి

ఈనెల 16న ఢిల్లీలో బీసీ మహిళల ధర్నా 

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్  

హైదరాబాద్, ఏప్రిల్ 12(విజయక్రాంతి): బీసీల ఐకాన్ మహాత్మ జ్యోతిబా పూలే 200 జయంతి సందర్భంగా మొదటిసారిగా పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించడం అభినందనీయమని, పూలే ఆశయాలు అమలు చేయడానికి ప్రధాని పాటుపడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈనెల 16 17 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా బిల్లు ఆమోదం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు కంటే ముందు జాతీయస్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు.

దేశంలో మెజార్టీ రాజకీయ పార్టీలు మహిళా బిల్లు లక్ష్యం నెరవేరాలంటే బీసీ మహిళలకు సబ్ కోట కల్పించాలని డిమాండ్ చేస్తున్నారని ఈ విషయాలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా మహిళా బిల్లుపై గోడ మీది పిల్లి వాటంగా వ్యవహరించకుండా బీసీ కోటపై తమ రాజకీయ విధానాన్ని ప్రకటించి ఈ నెల 16న జరిగే పార్లమెంటు సమావేశాల్లో బీసీ మహిళల సబ్ కోట కోసం పట్టుబట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లులో బీసీ మహిళ కల్పించే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అందులో భాగంగానే సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నిరసన చేపడతామని, అదేవిధంగా ఈనెల 16న ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపడతామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.