ప్రధాని పర్యటన విజయవంతం చేయాలి
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
కామారెడ్డి, మే 2 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనను విజయవంతం చేయాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం కామారెడ్డి బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 3 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి తెలంగాణలో 8, 238 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణలో ప్రధాని పర్యటనతో కేసిఆర్, రేవంత్ రెడ్డిలకు వెన్నులో వణుకు పుడుతుందన్నారు. కవిత పార్టీ పెట్టిన ప్రయోజనం ఉండదన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ల బాగోతాన్ని మాత్రమే బయట పెట్టేందుకు కవిత పనిచేస్తుందన్నారు.
కల్వకుంట్ల కుటుంబంలో ఎవరు శుద్ధ పూసలు లేరని ప్రజలు గ్రహించారన్నారు. కవిత పార్టీకి రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉందన్నారు. అంతిమంగా బీజేపీకి మేలు జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు, మాజీ ఎమ్మెల్యేలు అరుణతార, సైదిరెడ్డి, రాష్ట్ర నాయకుడు బాణాల లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, బాల్ కిషన్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






